భాషా బేధం లేకుండా ఒక్క హిందీలో తప్ప రూపొందిన అన్నీ భాషల్లోనూ సూపర్ హిట్ అయిన చిత్రం “దృశ్యం”. తొలుత మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సొంతం చేసుకోగా అనంతరం తెలుగులో వెంకటేష్ కథానాయకుడిగా అదే టైటిల్ తో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా మంచి విజయాన్నందుకొంది. అదే చిత్రాన్ని కమల్ హాసన్ తమిళంలోనూ రీమేక్ చేసి చాన్నాళ్ల తర్వాత కమర్షియల్ సక్సెస్ అందుకొన్నాడు. ఆ తర్వాత హిందీలో అజయ్ దేవగన్ కూడా రీమేక్ చేశాడు కానీ.. కథలో కీలకమైన కూతురు సెంటిమెంట్ ను వర్కవుట్ చేయలేదు. అందువల్ల హిందీలో మాత్రం ఫ్లాపయ్యింది.
ఇప్పుడు యూనివర్సల్ సబ్జెక్ట్ కు తెలుగులో సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నాడు మన “బాబు బంగారం” వెంకటేష్. తన వయసుకు తగ్గ పాత్రలు చేయాలనుకొంటున్న వెంకీ “దృశ్యం”కు సీక్వెల్ కోసం కథ రెడీ చేయమని తనకు తెలిసిన రచయితలకు చెప్పాడట. అలాగే.. హాలీవుడ్ యాక్షన్ సిరీస్ “టేకెన్” తరహాలో ఆ సిరీస్ ఉండాలని సూచించాడట. మరి ఆ సీక్వెల్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి!