నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ను ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా దేవి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి దేవి చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ఈ నేపధ్యంలో క్రిష్ ఈ సినిమా కోసం అడిగినన్ని డేట్స్ దేవి అడ్జస్ట్ చేయలేకే తప్పుకుంటున్నట్లు టాక్. కానీ కొందరు మాత్రం క్రిష్ కు, దేవికు మధ్య ఏర్పడిన వృత్తిపరమైన అభిప్రాయబేధాల వలనే దేవి తప్పుకుంటున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనేది చిత్రబృందం ఆలోచన. దానికోసం దేవి చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది.
ఈ ఒక్క సినిమా కోసం అంత సమయం కేటాయిస్తే తను కమిట్ అయిన మిగిలిన ప్రాజెక్ట్స్ సంగతేంటనే ఆలోచనతో క్రిష్ కు హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో క్రిష్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.