ఈ ఏడాది తెలుగులో ఫస్ట్‌డే అత్యధిక వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ సినిమాలు ఇవే..!

తెలుగు ఇండస్ట్రీ పాండమిక్ కారణంగా రెండేళ్లకు పైగా నానా ఇబ్బందులు పడింది.. పోయిన సంవత్సరం చివరి నెలలో వచ్చిన ‘అఖండ’, ‘పుష్ప’ సినిమాలు చిత్ర పరిశ్రమకి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమేకాక.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటనేది మరోసారి రుచి చూపించింది.. తెలుగు ప్రేక్షకులకు కథ, కథనాలు నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఎంతలా ఆదరిస్తారనే విషయం ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది.

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన ‘కాంతార’ చిత్రాన్నే ఉదాహరణగా చెప్పొచ్చు.. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న దళపతి విజయ్ ‘బీస్ట్’ దగ్గరి నుండి, రీసెంట్ హాలీవుడ్ సెన్సేషన్ ‘అవతార్ 2’ వరకు తెలుగునాట కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టాయి.. తమిళ్, కన్నడ, హిందీ వాళ్లు కూడా ఆశ్చర్యపోయేలా కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపించింది తెలుగు ఇండస్ట్రీ.. ఇంతలా ఇతర భాషల సినిమాలు ఆదరించడం అనే ఈ ఘనత ఒక్క తెలుగు ఇండస్ట్రీకే సాధ్యం..

ఈ 2022లో కన్నడ నుండి ‘కేజీఎఫ్ 2’, తమిళ్ నుండి ‘బీస్ట్’, ‘పొన్నియన్ సెల్వన్ – 1, హిందీ నుండి ‘బ్రహ్మాస్త్ర’, హాలీవుడ్ నుండి ‘అవతార్ 2’ మూవీస్ వచ్చాయి.. ఫస్ట్ డే రికార్డ్ రేంజ్ వసూళ్లు సాధించాయి.. ‘కాంతార’ లాంటి సినిమాను తెలుగులో రూ. 2 కోట్లకే కొంటే.. తొలిరోజు రూ. 4 కోట్ల గ్రాస్, రూ. 2 కోట్ల షేర్ సాధించి ఫస్ట్‌డేనే బ్రేకీవెన్ కావడం విశేషం.. ఈ ఏడాది తెలుగులో ఫస్ట్‌డే అత్యధిక వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ సినిమాల (టాప్) వివరాలు ఇలా ఉన్నాయి..

1. కె.జి.యఫ్ 2 – రూ. 31 కోట్లు..

2. బీస్ట్ – రూ. 9 కోట్లు..

3. బ్రహ్మాస్త్ర – రూ. 7 కోట్లు

4. పొన్నియన్ సెల్వన్ : 1 – రూ. 5.5 కోట్లు..

5. అవతార్ 2 – రూ. 13.65 కోట్లు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus