షారూక్ వల్లనే…బ్రహ్మోత్సవం ఫ్లాప్!!!

వినేవాడు ఉండాలే కానీ, ఏనుగు విమానం నడిపింది అని చెప్తారు. విషయం ఏమిటంటే టాలీవుడ్ టాప్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు నిర్మిస్తూ నటించిన సినిమా “బ్రహ్మోత్సవం” ఈ సినిమా విడుదలయ్యి దాదాపుగా 3 రోజులు కావొస్తున్నా, ఈ సినిమాపై ఎక్కడా పాజిటివ్ టాక్ రాకపోవడంతో మహేష్ అభిమానులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

అదే క్రమంలో ఆన్‌లైన్ లో ప్రిన్స్ సినిమాపై వస్తున్న కామెంట్స్ కూడా అధికం కావడంతో ప్రిన్స్ అభిమానులు తలెత్తుకోలేక చాలా సిగ్గు పడుతున్నట్లుగా వార్తలు వస్తునాయి. ఇదే క్రమంలో కర్ణుడి చావుకు సవ లక్ష కారణాలు అని, సినిమాలో సరైన కధ లేక, సినిమాలో కధనం బాగోలేక ఈ సినిమా డిజాష్టర్ గా మారింది, కానీ ఈ సినిమా ఫ్లాప్ కు బాలీవుడ్ బాద్‌షా కింగ్ ఖాన్….షారూక్ కారణం అంటున్నారు కొందరు, అయితే ఆ లాజిక్ ఏంటో మీరే చూడండి…ఏం లేదు…సెంటిమెంట్ రీజన్ అంటున్నారు..ఇంతకీ అదేదో సినిమా లో సెంటిమెంట్ కాదు….షారూక్ సెంటిమెంట్.

అదెలాగా అంటే…హైదరాబాద్ లో తన సినిమా దిల్వాలే షూటింగ్ జరుపుకున్న విజిట్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయట. స్వతహాగా ఆయన నటించిన సినిమా ఫ్లాప్ అవ్వడమే కాక ఆయన విజిట్ చేసిన రెండు సినిమాలు అలాంటి చేదు అనుభవాన్నే మిగిల్చాయట. ఆ సినిమాలు ఏమిటంటే ఒకటి చరణ్ నటించిన బ్రూస్ లీ మరొకటి మహేష్ నటించిన బ్రహ్మోత్సవం. వినడానికి వింతగా ఉన్నా…విని నవ్వుకోవడానికే తప్పా, సినిమాకు ఆయనకు లింక్ ఏంటి…ఇది మరీను…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus