Dulquer Salmaan: దుల్కర్‌ మరో తెలుగు సినిమా.. మరోసారి ఆ నిర్మాణ సంస్థలోనే!

  • July 5, 2024 / 01:26 PM IST

దుల్కర్‌ సల్మాన్‌ను (Dulquer Salmaan) తొలినాళ్లలో ‘ఓకే బంగారం’ (OK Bangaram) సినిమాలో చూసి ‘మన దగ్గర వరుస సినిమాలు చేస్తే బాగుండు’ అని అనుకోని సినిమా ప్రేక్షకుడు ఉండడు. గుడ్‌ లుకింగ్, నైస్‌ యాక్టింగ్‌తో భలేగా ఉంటాడు ఈ మమ్ముట్టి (Mammootty) వారసుడు. అలా అనుకున్నవాళ్ల కోరిక నెరవేరేలా దుల్కర్‌ అడపాదడపా ఇక్కడ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంకాస్త జోష్‌ ఇచ్చేలా మరో సినిమాను ఓకే చేశాడు అని టాక్‌. త్వరలో ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చేస్తుంది అంటున్నారు.

దుల్కర్‌ సల్మాన్‌ మలయాళంలో ఎంత బిజీగా ఉన్నా.. తెలుగులోనూ సినిమాలు చేయాలని ఫిక్స్‌ అయిపోయాడు అని అర్థమవుతోంది. ‘మహానటి’ (Mahanati) సినిమాతో తెలుగులో మరపురాని పాత్రను చేసిన దుల్కర్‌.. ఆ తర్వాత ‘సీతారామం’ (Sita Ramam) సినిమాతో మరింత దగ్గరైపోయాడు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar) అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ లోపే మరో తెలుగు సినిమా ఓకే చేశాడు అంటున్నారు.

దుల్కర్‌ ఇప్పటివరకు తెలుగులో చేసిన సినిమాలు రెండూ వైజయంతి మూవీస్‌వే. ఆ బ్యానర్‌ మీదే తెలుగులో లాంచ్‌ అయ్యాడు. రీసెంట్‌ ఆ బ్యానర్‌ సినిమా ‘కల్కి 2898 ఏడీ’లో (Kalki 2898 AD) అతిథి పాత్రలో కనిపించాడు కూడా. ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా అందులోనే అంటున్నారు. పవన్ సాధినేని దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్‌ లాకైనట్టు సమాచారం. ప్రస్తుతం కథా చర్చలు తుదిదశకు వచ్చాయి అని చెబుతున్నారు.

ఈ బ్యానర్‌ కాకుండా దుల్కర్‌ చేసిన సినిమా ‘లక్కీ భాస్కర్‌’. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ మీద వెంకీ అట్లూరి (Venky Attluri) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ మధ్య టీజర్‌ వచ్చినప్పుడు భారీ స్పందనే వచ్చింది. ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఆ సినిమా కచ్చితంగా దుల్కర్‌కు మంచి పేరు తెచ్చిపెడుతుందని టీమ్‌ చెబుతోంది. మరి ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఏదేమైనా దుల్కర్‌ వరుస సినిమాలు చేస్తుండటం ఆసక్తికరమే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus