ఒక్కోసారి కొన్ని సినిమాలకి ప్లాప్ టాక్ వచ్చినా.. కాంబినేషనల్ క్రేజ్ కలిసి రావడం వల్ల పాస్ మార్కులు వేయించుకుంటూ ఉంటాయి. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు ‘డంకీ’ కూడా చేరినట్టు స్పష్టమవుతుంది.బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అపజయమంటూ ఎరగని బాలీవుడ్ స్టార్ దర్శకుడిగా రాజ్ కుమార్ హిరానికి మంచి పేరు ఉంది.
షారుఖ్ ఖాన్ కూడా ఈ ఏడాది ‘పఠాన్’ ‘జవాన్’ వంటి సూపర్ హిట్లతో ఫామ్లోకి వచ్చారు.కానీ ‘డంకీ’ సినిమాకి తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా రాజ్ కుమార్ హిరానీ 10 ఏళ్ళ క్రితం తీయాల్సిన సినిమా ఇప్పుడు తీసాడు అంటూ పెదవి విరిచారు. కానీ కాంబినేషనల్ క్రేజ్ కలిసి రావడం వల్లనో ఏమో ‘డంకీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. తొలివారం ఈ సినిమా రూ.304 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
నెట్ రూ.180 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా. అయితే బ్రేక్ ఈవెన్ కి (Dunki) ‘డంకీ’ సినిమా ఇంకో రూ.70 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ ను సాధించాయి. పోటీగా ‘సలార్’ ఉండటం వల్ల ‘డంకీ’ పెద్ద రేంజ్లో కలెక్ట్ చేయలేకపోతోంది. కానీ ఇప్పుడు స్టడీగా నిలబడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మాత్రం ఫామ్ ని కంటిన్యూ చేస్తే .. జనవరి 1 ఆ టైంకి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!