హీరోయిన్ గా రాణించాలంటే నట ప్రదర్శన మాత్రమే కాదు అందాల ప్రదర్శన కూడా చాలా అవసరం. అందుకు తెలుగమ్మాయిలు మినహాయింపేమీ కాదు. అందుకే అంజలి, బింధుమాధవి, రీతూ వర్మ వంటి తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించడం కోసం గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చారు. తాజాగా ఈ కోవలో ఈషా రెబ్బ కూడా చేరింది. నిన్నమొన్నటివరకూ సాంప్రదాయబద్దమైన పాత్రలు చేస్తూ కాస్త వెస్ట్రన్ మోడ్ లో మాత్రమే దర్శనమిచ్చిన ఈషా ఈమధ్యకాలంలో తన అందాలను సరికొత్త ఫోటోషూట్ ల ద్వారా ఆన్ లైన్ లో ప్రేక్షకులకు రుచి చూపడం ప్రారంభించింది.
అయితే.. రీసెంట్ గా ఈషా చేయించుకొన్న ఒక ఫోటోషూట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమ్మడు సొగసుల సత్తాను కాస్త ఘనంగానే చాటింది. ఇప్పటివరకూ ఈషా గ్లామర్ షో చేయలేదని కొన్ని కమర్షియల్ సినిమాల్లో సెలక్ట్ చేసుకొని దర్శకనిర్మాతలు ఇప్పుడు ఆమెను కన్సిడర్ చేయడం మొదలెట్టారు. ఇదే విషయమై ఆమెను ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే.. “ఇలాంటి హాట్ ఫోటోలు పెట్టిన తర్వాతే నన్ను గుర్తిస్తున్నారు. అయినా నా గ్లామర్ ను షోకేస్ చేసుకోవడానికి నేనెప్పుడూ ఇబ్బందిపడలేదు, అలాంటిది మీకేందుకు బాధ” అన్నట్లుగా సమాధానం ఇచ్చింది. మరి ఈషాకి ఈ గ్లామ్ షో ఎంతవరకూ పనికొస్తుందో చూడాలి.