Eesha Rebba: ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలలో ఇది గమనించారా?

  • June 27, 2021 / 09:59 PM IST

తెలుగమ్మాయి ఈషా రెబ్బా కెరీర్ సో సో గానే సాగుతున్నా….స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అది సోషల్ మీడియాలో లెండి.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు అటు తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా హీరోయిన్ గా మారింది. ఆ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించుకుంది .

అటు తర్వాత ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ ‘దర్శకుడు’ ‘అ!’ ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘సవ్యసాచి’ ‘రాగల 24 గంటల్లో’ వంటి చిత్రాల్లో నటించింది. ‘లస్ట్ స్టోరీస్’ రీమేక్ అయిన ‘పిట్ట కథలు’ వెబ్ మూవీలో కూడా నటించింది. సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సందడి చేస్తుంటుంది ఈషా. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలను సరిగ్గా గమనిస్తే.. ఈషా చేతికి గాయం అయినట్టు స్పష్టమవుతుంది.

ఎర్రగా .. కందిపోయినట్టు ఉన్న మచ్చని మనం గమనించవచ్చు.దీంతో ఏమైంది ఈషా… ఆ గాయం వెనుక కథేంటి అంటూ నెటిజన్లు ఆమెను ఆరా తీస్తున్నారు. ఇంకా ఆమె దీని పై స్పందించలేదు.సరే ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus