ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనరర్‌గా ‘ఏందిరా ఈ పంచాయితీ’.. ఫస్ట్ లుక్ రిలీజ్

డిఫరెంట్ కంటెంట్, అంతకుమించి డిఫరెంట్ గా టైటిల్.. ఇదే ఈ తరం ప్రేక్షకలోకం మెచ్చే సినిమా. స్టార్ హీరో హీరోయిన్స్ సంగతి పక్కనబెట్టి రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలకే ఓటేస్తున్నారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో తీసే సినిమాలకంటే మన ఊరి వాతావరణంలో తీసే సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. లోకల్ లాంగ్వేజ్, లోకల్ అడ్డాలనే తెగ ప్రేమిస్తున్నారు. అయితే నేటితరం ప్రేక్షకుల టేస్ట్‌కి అనుగుణంగా వీటన్నింటినీ కలగలుపుతూ తీసిన సినిమానే ‘ఏందిరా ఈ పంచాయితీ’.

ఈ సినిమాను ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకుంది. ఊర్లోని వాతావరణాన్ని, చిన్న గొడవలు, కులవృత్తులను తెలియజేసేలా కొన్ని సంకేతాలను వదిలారు. ఇలా టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఎట్రాక్ట్ చేశారు.

ఈ పోస్టర్ చూస్తుంటే ‘ఏందిరా ఈ పంచాయితీ’ రూపంలో ఓ కంప్లీట్ విలేజ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఊరి చివర సహజమైన వాతావరణంలో హీరో హీరోయిన్ ఓ గోడ మీద కూర్చొని ముచ్చటించుకుంటున్న సీన్ ఫస్ట్ లుక్‌గా వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ గాఢమైన ప్రేమలో అస్సలు సంబంధం లేని ఎన్నో పంచాయితీలు చోటు చేసుకుంటాయని.. ఈ పంచాయితీల చుట్టే ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఏదిఏమైనా పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్ తెప్పిస్తుందని మాత్రం అర్థమవుతోంది.

ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

సాంకేతిక బృందం
బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం
డైరెక్టర్ : గంగాధర. టి
కెమెరామెన్ : సతీష్‌ మాసం
సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
మాటలు : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల
ఎడిటర్ : జేపీ
డీఐ : పీవీబీ భూషణ్
పీఆర్వో : సాయి సతీష్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus