AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

అల్లు అర్జున్‌ నుండి సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది. అయినా అభిమానులు ఈ గ్యాప్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రెండేళ్ల క్రితం బన్నీ నుండి వచ్చిన సినిమాలు భారీ విజయం అందుకుని.. నేషనల్‌ వైడ్‌ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న సినిమాకు ఇలాంటి ఫలితమే వస్తుంది అని నమ్ముతున్నారు. సినిమాకు సంబంధించిన ఏ అంశాలూ బయటకు రాకపోయినా.. హైప్‌ అయితే హైలో ఉంది. అదే ‘రాకా’.

AA 23

ఈ సినిమా ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది అనే వివరాలు ఇప్పటివరకు బయటకు రాకపోయినా.. 2027లోనే సినిమా రిలీజ్‌ అవుతుంది అని చెప్పేయొచ్చు. ఎందుకంటే ఇంకా 2026లో రోజులు లేవు. ఉన్న ఒక్క నెలలో వచ్చే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ప్రశ్న ‘రాకా’ తర్వాత బన్నీ చేయబోయే సినిమాకు ఇంకెన్నాళ్లు గ్యాప్‌ తీసుకుంటాడు అని. ‘రాకా’ కోసం ఎక్కువ కాలం/ కష్టం తీసుకున్న బన్నీ.. రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్తాడేమో అనుకున్నారంతా.

కానీ, ఆయన తండ్రి.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మాటలు చూస్తుంటే వేరేలా ఉన్నాయి. ఇటీవల ఓ సినిమా ప్రచారంలో మాట్లాడుతూ 2027, 2028 సంవత్సరాల్లో అల్లు అర్జున్‌ నుండి రెండు అదిరిపోయే సినిమాలు వస్తాయని చెప్పేశారు. ఆయన పేర్లు చెప్పలేదు కానీ.. ఆ సినిమాలేంటో అందరికీ తెలిసిందే. 2027లో ‘రాకా’ సినిమా రానుండగా.. 2028లో లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాను రిలీజ్‌ అవుతుంది అని చెప్పారు.

లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా ఏమంత చిన్న కథ కాదు అని చెబుతున్నారు. అలాంటిది ఏడాది గ్యాప్‌లోనే ఆ సినిమా పూర్త చేసి.. రిలీజ్‌ చేసేస్తారా అనే డౌట్‌ కచ్చితంగా ఉంది. కానీ అల్లు అరవింద్‌ అయితే చెప్పేశారు. మరి తండ్రి చెప్పినట్లుగా బన్నీ అనుకున్నట్లుగా రెండేళ్లలో రెండు సినిమాలు తీసుకొస్తారా అనేది చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం సూపర్‌ అనే చెప్పాలి. ఎందుకంటే రెండేళ్లు అవుతోంది బన్నీ నుండి సినిమా వచ్చి.

నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus