Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్
- September 13, 2026 / 08:40 PM ISTByPhani Kumar
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో ‘బేబీ’ సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దీంతో వీరి కాంబినేషన్లో రూపొందిన రెండో సినిమా ‘ఎపిక్'(Epic) పై కూడా మొదటి నుండీ మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, సంచారమే సాంగ్ ఇలా ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే యూత్ ను టార్గెట్ చేసింది.
Epic

కొన్ని అంశాల పై సోషల్ మీడియాలో గట్టి చర్చ కూడా జరిగింది.అయినప్పటికీ సినిమాని చాలా వరకు అడ్వాన్స్..ల బేసిస్ పైనే రిలీజ్ చేశారు. ఈ నేపధ్యంలో ‘ఎపిక్’ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 3.5 cr |
| సీడెడ్ | 0.50 cr |
| ఆంధ్ర(టోటల్) | 3 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 7 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.50 cr |
| ఓవర్సీస్ | 1.5 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 9 cr (షేర్) |
‘ఎపిక్’ చిత్రానికి రూ.9 కోట్ల వరకు ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నది కాదు. కానీ ‘బేబీ’ హిట్ పెయిర్ కావడంతో ‘ఎపిక్’ పై యూత్ ఫోకస్ గట్టిగానే ఉంది. కాబట్టి సినిమాకి ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చూడాలి మరి.. ఆ అవకాశాల్ని ఎంత వరకు వాడుకుంటుందో..!
సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్ పెట్టా: సమంత















