‘2020 త్వరగా వెళ్ళిపో’.. అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్ల హడావిడి చూస్తూనే ఉన్నాం. అవును.. 2020 ప్రతీ ఒక్కరినీ ఓ రేంజ్లో ఆడేసుకుంది. కరోనా ఎంట్రీతో లాక్ డౌన్ ఏర్పడడం.. ఇంకా అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం మనం చూసాం. అందుకే పాయల్ రాజ్ పుత్ వంటి హాట్ హీరోయిన్లు కూడా.. ‘2020 ని వీలైనంత త్వరగా ముగించాలని.. కొత్త ఆశలతో, ఆశయాలతో 2021కు స్వాగతం పలకాలి’ అంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
ఇంకా చాలా మంది సెలబ్రటీలు 2020 పై సెటైర్లు వేస్తూ కామెడీ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా మాత్రం నెక్స్ట్ లెవెల్లో 2020 కి గుడ్ బై చెబుతుందనే చెప్పాలి. దానికి అంతా షాక్ అవుతున్నారు కూడా..! విషయం ఏమిటంటే.. ఇషా గుప్తా తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటోని అప్లోడ్ చేసింది. దీనిని గమనిస్తే ఆమె బెడ్ పై నుండీ నిద్ర లేస్తూ.. ఒళ్ళు విరుచుకుంటుంది. అయితే ఆమె న్యూడ్ గా ఉండడంతో.. ఇది కాస్త సంచలనంగా మారింది.
మామూలుగానే ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో తన ఎక్స్ పోజింగ్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ పెద్ద రచ్చ చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు కళ్ళు తిప్పు కోకుండా చేస్తాయి అనడంలో కూడా సందేహం లేదు. సంవత్సరంలో ఆఖరి రోజు అంతకు మించిన డోస్ ఇవ్వాలి అనుకుందేమో.. ఇంత ఘాటుగా ఫోజిచ్చి తన ఫాలోవర్స్ కు ఫీస్ట్ ఇచ్చింది ఇషా. ఇక ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండడం మరో విశేషం.