Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Advertisement

‘అనిశ్రీ ఎంటర్టైన్మెంట్స్’ పతాకంపై వెంకట కళ్యాణ్ మండవిల్లి సమర్పణలో శిరీష మండవిల్లి నిర్మించిన తాజా ప్రైవేట్ ఆల్బమ్ ‘ఎవరే’. ఆనంద్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ పాటలో వెచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్ ప్రధాన జంటగా నటించారు.

Evare

ఎస్ ఎస్ వర్ధన్ సంగీతం అందించిన ఈ పాట మే 1న ‘క్రేజీ ఎన్ క్యాచీ’ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా అర్జున్ అంబటి, సింగర్ సాకేత్, రాంబాబు గోసాల విచ్చేశారు.

ఈ క్రమంలో అర్జున్ అంబటి మాట్లాడుతూ… “నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీలో మరిన్ని మంచి ప్రాజెక్టులు వస్తాయి. ఈ సాంగ్‌లో కృష్ణ పక్కింటి అబ్బాయిలా చాలా నేచురల్‌గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పాడిన విధానం బాగుంది, అతను సింగర్‌గా మరిన్ని శిఖరాలు అధిరోహించాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.”

సింగర్ సాకేత్ మాట్లాడుతూ…. “ఈ పాటలో మెలోడీతో పాటు మంచి ఎనర్జీ ఉంది. వర్ధన్ మ్యూజిక్ వింటే ఆయన భవిష్యత్తులో తమన్ అంతటి స్థాయికి చేరుకుంటారనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, అనన్య అద్భుతంగా పాడారు.”

రాంబాబు గోసాల మాట్లాడుతూ… “ప్రోమో మరియు లిరిక్స్ చాలా ఆకట్టుకున్నాయి. ఈ పాట డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది”

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ వర్ధన్ మాట్లాడుతూ.. దాదాపు ఏడాది కాలం పాటు ఈ పాట కోసం టీమ్ అంతా శ్రమించామని, తన విజన్‌ని నమ్మి సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. గాయనీగాయకులు పవన్ కళ్యాణ్, అనన్య ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారని ఆయన ప్రశంసించారు.

డైరెక్టర్ ఆనంద్ తన గురువు లక్ష్మీ దేవి గారిని స్మరించుకుంటూ.. నిర్మాత కళ్యాణ్ గారు అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. హీరో కృష్ణ తన కెరీర్‌లో ఈ పాట ఎంతో ప్రత్యేకమని భావోద్వేగానికి లోనవ్వగా, హీరోయిన్ రిద్ధి అనామిక తెలుగులో ఇది తన తొలి ప్రాజెక్ట్ అని, అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

లిరిక్ రైటర్ మల్లిక వల్లభ పిట్ల, సింగర్లు పవన్ కళ్యాణ్, అనన్య భాస్కర్ కూడా పాల్గొని సాంగ్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

https://www.youtube.com/watch?v=RDPkIycHALs

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags