Jr NTR: భారీగా తగ్గిన షో రేటింగ్.. కారణమిదే?

  • October 1, 2021 / 12:27 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. వెండితెరపై వరుస విజయాలతో సత్తా చాటుతున్న యంగ్ టైగర్ బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు షోతో అదే స్థాయిలో సత్తా చాటలేకపోతున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు ఐదో వారం రేటింగ్ 4.70 కాగా ఈ రేటింగ్ ను చూసి అవాక్కవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతవుతోంది. ఎన్టీఆర్ రేంజ్ కు ఈ రేటింగ్ చాలా తక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రముఖ సెలబ్రిటీలు ఈ షోకు గెస్టులుగా హాజరవుతున్నా షో రేటింగ్ మాత్రం పుంజుకోవడం లేదు. వారంవారానికి రేటింగ్స్ తగ్గుతుండటంతో షో నిర్వాహకులు సైతం టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీలు మెచ్చే షో అయినప్పటికీ ఈ షో ప్రేక్షకుల అంచనాలకు తగ్గ రేటింగ్స్ ను సొంతం చేసుకోలేదు. ఈ షోతో పోలిస్తే బిగ్ బాస్ షో వీక్ డేస్ లో, వీకెండ్స్ లో మెరుగైన రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుండటం గమనార్హం.

వీక్ డేస్ లో బిగ్ బాస్ షో 5.76 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లో ఈ షోకు ఏకంగా 9.84 రేటింగ్ వచ్చింది. మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మహేష్, ప్రభాస్ గెస్టులుగా రానున్నారని ప్రచారం జరుగుతోంది. దసరా కానుకగా మహేష్ బాబు గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ ప్రసారం కానుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ షోకు 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus