వీకెండ్ వస్తే… బిగ్‌బాస్ హౌస్ ఇంట్లో మజా షురూ అయినట్లే. మామూలుగా అయితే గత సిరీస్‌ల్లో ఇలా అనుకునేవారు. ఈ సారి అయితే ఏకంగా వీకెండ్ రావాలి… ఈ సుత్తి గోల పోవాలి అనుకున్నారు. అంతగా విసిగించేశాడు బిగ్‌బాస్. ‘కట్టప్ప’ అనే టాస్క్ పట్టుకొని జీడిపాకంలా సాగదీశాడు. పోనీలే వీకెండ్ వచ్చేసిందిగా వదిలేయండి. ఈ రోజు హౌస్ మేట్స్‌ను నాగ్ ఓ ఆట ఆడేసుకున్నాడు. ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమోలను చూస్తే ఈ విషయం తెలిసిపోతోంది. తొలి ప్రోమోలో మోనాల్, అమ్మ రాజశేఖర్ పంచ్‌లు పడగా… కొత్త ప్రోమోలో నోయల్, సూర్యకిరణ్ వంతు వచ్చింది.
నోయల్ ప్రతి విషయానికి ఓవర్‌గా ఆలోచిస్తాడు… ఇంట్లో వాళ్లే కాదు, బయట జనాలు కూడా అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని నాగ్ మరోసారి రెయిజ్ చేశాడు. ఎవరెవరు అలా అనుకుంటున్నారో చేతులెత్తండి అని నాగ్ అడిగాడు. దానికి అఖిల్, కళ్యాణి, సూర్యకిరణ్, దేవీ నాగవల్లి, లాస్య, అమ్మ రాజశేఖర్, దివి చేతులెత్తారు. అంటే ఏడుగురు అదే అనుకుంటున్నారు. ఈ లెక్క ఇక్కడితో ఆగిందా… లేక వేరెవరైనా అన్నారా తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ ప్రోమో టార్గెట్ సూర్యకిరణ్. అతని గురించి కూడా నాగ్ అందరూ అనుకునే టాపిక్కే అడిగారు. ‘నీకు అనవసరమైన వాటిల్లోకి వెళ్లి లెక్చర్లు ఇస్తున్నావ్’ అంటూ జనాల మాట అడిగేశారు. నువ్వు డైరక్టర్‌వి కాబట్టి… వాళ్లను క్యారెక్టర్/నటులు అనుకుంటున్నావా అని ఘాటుగా అడిగారు నాగ్.
ఇక ఈ రోజు ఇంట్రెస్టింగ్ సీన్ ఇప్పుడు మొదలైంది. నైబర్ హౌస్‌లో ఉండి వచ్చిన ఆరియానా, సోహైల్‌కు నాగ్ ఓ టాస్క్ ఇచ్చినట్లున్నాడు. కొన్ని ట్యాగ్స్ ఇచ్చిన ఏది ఎవరికి నప్పుతుందో ఇవ్వమన్నారు. ఆ క్రమంలో డస్ట్ బిన్ వచ్చింది. దీనిని ఇవ్వడానికి సోహైల్ అస్సలు ఆసక్తి చూపించలేదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికో ఒకరికి ఇవ్వమంటే… దానిని అభిజీత్‌కి ఇచ్చింది ఆరియానా. ఇదంతా చూస్తుంటే అభిజీత్‌ను మరోసారి టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. వాళ్లిద్దరూ నైబర్ హౌస్ నుండి వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఔటాఫ్ కంట్రోల్ అవ్వకుండా ఆపింది అభిజీతే. అందుకే ఆ ట్యాగ్ ఇచ్చి రౌండప్ చేసినట్లు కనిపిస్తోంది.