గ్లామరస్ బ్యూటీ కీయరా అద్వానీ లక్కు ఏమిటో గాని ఎలాంటి సినిమాలు చేసినా ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతున్నాయి. ఆమె కంటే అందమైన బ్యూటీలు, సీనియర్ హీరోయిన్లు చాలామంది ఉన్నప్పటికీ ఓ వర్గం స్టార్ హీరోలు మాత్రం ఆమెనే కోరుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కీయరాకు సౌత్ నుంచి భారీ ఆఫర్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి సాలీడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.
అనంతరం మరికొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ ఎందుకో ఒప్పుకోలేదు. ఇక కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమాలో ఓకే అయినట్లు గత కొన్ని రోజులుగా ఒక టాక్ అయితే వస్తోంది. అలాగే శంకర్ – రామ్ చరణ్ కాంబోకి కూడా కీయరా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అల్లు అర్జున్ ఐకాన్ సినిమా కోసం కూడా అమ్మడిని సంప్రదించే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు అయితే వస్తున్నాయి. మరోవైపు మహేష్, పవన్ కళ్యాణ్ కూడా వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్నారు కాబట్టి తప్పకుండా వారితో ఎదో ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసే అవకాశం లేకపోలేదు.
అయితే కోలీవుడ్ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ వస్తుండగా కీయరా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఓప్పుకోవడం లేదట. భవిష్యత్తులో మాత్రం అమ్మడు చాలా బిజీ షెడ్యూల్ తో వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ టెన్షన్ ను ఎలా తట్టుకుంటుందో చూడాలి.