సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి.. పాస్ చేసిన జీవోలకి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కుదేలై పోతున్నారు. చెప్పాలంటే ఈ నిర్ణయం వల్ల వాళ్ళకే ఎక్కువ నష్టం.మరీ ముఖ్యంగా ఎగ్జిబిటర్లకు..! ఓ సినిమాని థియేటర్లలో ప్రదర్శించే విషయంలోనూ.. టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేసి నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లకు అందజేయడంలోనూ ఇతనిదే కీలక పాత్ర. కానీ ఏపీ ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయానికి వీళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది.
సాధారణంగా లాభాలు వస్తే అందులో వీళ్ళు రెండో వంతో, మూడో వంతో తీసుకుంటారని టాక్. ఇప్పుడు దానికి కూడా గండి పడినట్టు అయ్యింది. ఈ విషయంలో సినిమా పెద్దలు జోక్యం చేసుకోవడం లేదు. వీళ్లకు అండగా నిలబడాలని వారు చేస్తున్న ప్రయత్నాలు కూడా లేవు. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపుగా ఇలాంటి చర్యలు చేపట్టిందనే మాట వాస్తవమే..! కానీ దాని వల్ల హీరోకి కానీ ఆ సినిమాని నిర్మాతకు కానీ అందులో నటించిన నటీనటులకు కానీ ఎటువంటి నష్టం లేదు.
నష్టమంతా.. ఎగ్జిబిటర్లదే. మెగా ఫ్యామిలీ నుండీ చిరంజీవి కానీ.. ఇండస్ట్రీ పెద్దలైన నాగార్జున,అల్లు అరవింద్, దిల్ రాజు వంటి వారు ఈ విషయాల పై స్పందించడం లేదు.సినిమా బడ్జెట్లో 60 శాతం పారితోషికం తీసుకునే హీరోలు సైతం స్పందించకపోవడం షాకిచ్చే అంశం. పైగా మొన్నటికి మొన్న జగన్ పైన చిరు, నాగ్ లు ప్రశంసలు కురిపిస్తుండడం గమనార్హం. సరే.. ఇక ఏదైతే అదైందని చివరికి ఎగ్జిబిటర్లే ప్రభుత్వాన్ని బ్రతిమిలాడుకుని ఎంతో కొంత రాబట్టుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!