వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. 2019 లో వచ్చిన ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. సోనాల్ చౌహాన్ ,మురళీ శర్మ, సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో మొదటినుండీ ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక మే 27న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ వీక్ మంచి కలెక్షన్లను రాబట్టింది.రెండో వారం కూడా ఓకే అనిపించింది. ‘మేజర్’,’విక్రమ్’ వంటి హిట్ సినిమాలు రావడం వలన ఈ మూవీ కలెక్షన్లు బాగా తగ్గాయి. కానీ ఉన్నంతలో ఈ పర్వాలేదు అనిపించింది.! ‘ఎఫ్ 3’ 2 వారాల కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం | 17.60 cr |
సీడెడ్ | 5.85 cr |
ఉత్తరాంధ్ర | 5.72 cr |
ఈస్ట్ | 3.22 cr |
వెస్ట్ | 2.43 cr |
గుంటూరు | 3.21 cr |
కృష్ణా | 2.80 cr |
నెల్లూరు | 1.74 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 42.57 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.93 cr |
ఓవర్సీస్ | 7.05 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 52.55 cr |
‘ఎఫ్3’ మూవీకి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.52.55 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.11.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి క్రేజీ సినిమాలు విడుదలవడంతో ‘ఎఫ్3’ కలెక్షన్లు బాగా తగ్గాయి. కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తుంది. నిన్న కూడా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.0.20 కోట్ల షేర్ ను రాబట్టింది.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!