Mahesh Babu, Rajamouli: రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్.. కానీ ట్విస్ట్ ఇదే!

మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుకాకపోయినా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా మహేష్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందని మహేష్ మార్కెట్ ఈ సినిమాతో 10 రెట్లు పెరుగుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో మహేష్ బాబు తండ్రిగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని

మహేష్ కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే ఈ వార్తలు మహేష్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నా ఇతర హీరోల అభిమానులను, సాధారణ ప్రేక్షకులను ఈ వార్తలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. సినిమా షూట్ మొదలయ్యే వరకు సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని రివీల్ చేయడానికి కూడా రాజమౌళి ఇష్టపడరు.

రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే కనీసం రెండేళ్ల పాటు మూవీ షూట్ జరుగుతుందనే సంగతి తెలిసిందే. అందువల్ల సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను కూడా నిదానంగా ఇవ్వడానికి జక్కన్న ఆసక్తి చూపుతారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి అధికారికంగా వార్తలు వస్తే మాత్రమే నమ్మాల్సి ఉంటుంది.

మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు బడ్జెట్ విషయంలో హద్దులు లేవని నిర్మాత కేఎల్ నారాయణ ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ విడుదలకు ముందు విడుదల తర్వాత భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus