స్టార్ హీరోల దగ్గరకి వచ్చేందుకు వారి అభిమానులు పబ్లిక్ ఈవెంట్స్ లేదా ప్రయివేట్ గేదరింగ్స్ లో ప్రయత్నించడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. పవన్ కళ్యాణ్, ఎన్ఠీఆర్, ప్రభాస్, సూర్య అల్లు అర్జున్ లాంటి హీరోలందరూ ఇలాంటి సిట్యుయేషన్ ను ఫేస్ చేశారు. నిన్న వైజాగ్ లో జరిగిన “డియర్ కామ్రేడ్” ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఒక అభిమాని ఒక్కసారిగా వచ్చి విజయ్ దేవరకొండ కాళ్ళ మీద పడ్డాడు. ఊహించని విషయం కావడంతో విజయ్ కూడా కిందపడ్డాడు.
అయితే.. ఆ సందర్భంలో విజయ్ దేవరకొండ సదరు అభిమానిని ఉద్దేశించి మాట్లాడుతూ “ఏందిరా అది? ప్రేమా లేక ఎటాక్ చేసావా? ఏం అర్ధం కావడం లేదు” అని విజయ్ రియాక్ట్ అయిన పధ్ధతి బాలేదు. అలాగే.. అది ప్లాన్డ్ గా జరిగిన విషయం అని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా వీడియో ఆధారంగా ప్రొడ్యూసర్ సిగ్నల్ ను బట్టే అది జరిగిందని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియాలంటే చిత్రబృందం నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిందే.