టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన లుక్స్ విషయంలో రిస్క్ లు చేయడు అనే కంప్లైంట్ ఉంది. ‘మహర్షి’ ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించాడు.. ఆ లుక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలు విడుదలకు ముందు ఎక్కువ హైప్ ను సొంతం చేసుకోవడానికి ఆ లుక్స్ చాలా హెల్ప్ అయ్యాయని చెప్పాలి. అయితే నిజ జీవితంలో మాత్రం మహేష్ ఎప్పుడూ కూడా చాలా సింపుల్ గా కనిపిస్తాడు.
లైట్ బ్లూ కలర్ షర్ట్ లేదంటే వైట్ షర్ట్.. దానికి మ్యాచ్ అయ్యే బ్లాక్ కలర్ జీన్స్.. అంతే ఉంటుంది. అలాంటి సింపుల్ లుక్ లోనే ఎక్కువగా మహేష్ కనిపిస్తూ ఉంటాడు. తన వద్ద ఓ 25,30 బ్లూ కలర్ షర్ట్లు ఉన్నాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మహేష్. అలా అని బ్లూ కలర్ అంటే తనకు ఇష్టం అని కాదు.. అలవాటుగా బ్లూ కలర్ షర్ట్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తుంటాడు అని మహేష్ తెలిపాడు.
అయితే ఇప్పుడు మహేష్ (Mahesh Babu) కూడా రూటు మార్చాడు. ఎప్పుడు రొటీన్ గా కనిపించకూడదు అని అతను ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. ప్రస్తుతం అతను ట్రెండో లుక్ లోకి మారిపోయాడు. తాజాగా మహేష్ ఓ ఫోటో షేర్ చేశాడు. ఇందులో సూటు,బూటు వేసుకుని చాలా స్టైల్ గా కనిపిస్తున్నాడు.
అలాగే మహేష్ కు లాంగ్ హెయిర్ ఉండటం, అది మొహం పై పడకుండా ఓ క్యాప్ లాంటి పిన్ పెట్టుకోవడాన్ని మనం గమనించవచ్చు. అలాగే తన పెంపుడు కుక్కని చేత్తో పట్టుకున్నాడు మహేష్. ఈ ఫోటో చూసిన మహేష్ అభిమానులు టెంపర్ స్టైల్ లో ‘అన్నా నువ్వు మారిపోయావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!