రిస్క్ వద్దు అంటున్న వెంకీ ఫ్యాన్స్!!!

  • August 22, 2016 / 11:15 AM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన వెంకటేష్ తాజాగా బాబు బంగారంతో సూపర్ హిట్ కొట్టి సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. అయితే మంచి కుటుంభ కధా చిత్రాలు, ఆతరువాత కమర్షియల్ చిత్రాలు చేస్తూ వరుస హాట్స్ తో దూసుకుపోయిన వెంకీ ఇప్పుడు రిస్క్ చెయ్యబోతున్నాడు అన్న వార్తలు టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తున్నాయి..ఇంతకీ విషయం ఏమిటంటే…తాజాగా వెంకీ బాబు బంగారం హిట్ తరువాత తన సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు.

అందులో భాగంగానే, సలా ఖదూస్ సినిమా రీమేక్ చేసేందుకు సమాయత్తమవుతున్నాడు అని ఇండస్ట్రీ టాక్. ఇక ఈ మధ్యనే హిందీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా మీద కూడా వెంకటేష్ కన్ను పడ్డదట. రెజ్లర్ సుల్తాన్ గా సల్మాన్ అద్భుతమైన నటనతో బీ టౌన్ ఆడియెన్స్ నే కాదు సిని ప్రపంచం మొత్తం వారెవా అనిపించేలా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడట వెంకటేష్. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇది కాస్త రిస్క్ తో కూడిన వైవహారం అని ఇప్పటికీ వెంకీకి డాక్టర్స్ సూచించారు.

కానీ అసలు విషయం ఇంకొకటి ఉంది అదేమిటంటే….సుల్తాన్ లో సల్మాన్ మెయింటైన్ చేసిన బాడీ.. ఇంకా అండర్ వేర్ తో చేసిన సీన్స్ ఇవన్ని వెంకటేష్ చేయగలడా అలా చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయగలరా అన్న సందేహం మొదలైంది. ఇప్పటికే సలా ఖదూస్ సినిమా కోసం దేహదారుడ్యాన్ని పెంచుతున్న వెంకటేష్ పనిలో పనిగా సుల్తాన్ కూడా చేసేస్తాడని టాక్ రావడంతో ఫ్యాన్స్ అంతా…అంత రిస్క్ వద్దు నువ్వు నీలాగా ఫ్యామిలీ మూవీస్, ఎంటర్‌టేన్‌మెంట్ మూవీస్ చేస్తే చాలు అంటున్నారు. మరి వాళ్ళ మాటని వెంకీ వింటాడో. లేకపోతే లైట్ తీసుకుంటాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus