Rajinikanth: పిక్‌ టాక్‌: 40 ఏళ్లకు ముందు… తర్వాత.. అదరగొట్టిన రజనీకాంత్‌!

Advertisement

ఏజ్‌ పెరిగే కొద్దీ అందం పెరగడం హీరోయిన్ల విషయంలో చూస్తుంటాం. అదే హీరోల విషయంలో అయితే వయసు పెరిగే కొద్దీ గ్రేస్‌ పెరుగుతుంది, క్రేజ్‌ పెరుగుతుంది. అందుకే మన స్టార్‌ హీరోయిలు ముఖ్యంగా సీనియర్‌ స్టార్‌ హీరోలు ఇప్పటికీ ఫ్యాన్స్‌ని అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సౌత్‌ హీరోలు అని చెప్పాలి. ఆ విషయం పక్కనపెడితే ఇలాంటి సూపర్‌ క్రేజీ పిక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ పసుపు రంగు బైక్‌ మీద రజనీకాంత్‌ కూర్చున ఫొటో ఇది. ఈ ఫొటోలో ఉన్న బైక్‌కి 40 ఏళ్ల కథ ఉంది.

రజనీకాంత్ రేర్ ఫోటోను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం స్టూడియోస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 90 ఏళ్లుగా సినిమా ప్రయణాన్ని కొనసాగిస్తున్న ఏవీఎం సినిమా సంస్థ.. స్పెషల్‌ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ తమ కంపెనీ సినిమాల్లో ఉపయోగించిన వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. ఏవీఎం ప్రొడక్షన్‌ సంస్థ 1935 నుండి ఇప్పటివరకు వేల సినిమలు రూపొందించిన విషయం తెలిసిందే. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీలో ఈ సంస్థ వరుస సినిమాలు చేసింది. అందుకే ఈ ఉత్సవం.

స్టార్ హీరో సూపర్ స్టార్ (Rajinikanth) రజనీకాంత్, రాధ ప్రధాన పాత్రల్లో ‘పాయుమ్ పులి’ అనే సినిమా 1983లో వచ్చింది. పంజు అరుణాచలం రచించిన కథతో ఎస్పీ ముత్తురామన్ ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో రజనీకాంత్ వాడిన సుజుకీ బైక్‌ను ఏవీఎం కంపెనీ ఇప్పటికీ అలానే మెయిన్‌టైన్‌ చేస్తోంది. ప్రస్తుతం చెన్నైలో కంపెనీ నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌లో ఆ బైక్‌ను ఉంచింది. ఇటీవల రజనీకాంత్‌ ఆ ఎగ్జిబిషన్‌కు వచ్చినప్పుడు ఆ బైక్‌పై కూర్చుని స్టైల్‌గా పోజిచ్చాడు.

ఆ ఫొటోను ఏవీఎం టీమ్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. కలకాలం భద్రపరుచుకోవాల్సిన మూమెంట్స్‌ ఇవి అని రాసుకొచ్చింది. దాంతోపాటు ‘పాయుమ్‌ పులి’ సినిమాలోని రజనీకాంత్‌ పాత్రను చూపిస్తూ ఓ వీడియో కూడా సిద్ధం చేశారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus