పవన్ అభిమానులకు అదో ఆనందం!!!

  • August 4, 2016 / 07:09 AM IST

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే పడి చచ్చిపోయే అంత అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది. ఉన్నారు….పవనిజమ్ పేరుతో హడావిడి చేస్తూ పవన్ పై తమ అభిమానాన్ని చూపించే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. అయితే ఆయన సినిమా వస్తుంది అంటే చాలు దాదాపుగా వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలు పెట్టు, హంగామా చేసేస్తూ ఉంటారు.

అలాంటిది ఆయన బర్త్‌డే అంటే…..ఇంకా వేరే చెప్పాలా….ఈ సారి పవన్ అభిమానులు ఆయన బర్త్‌డే ను చాలా కొత్తగా సరికొత్త ట్రెండ్ ను సృష్టించే విధంగా ప్లాన్ చేశారు…ఇంతకీ విషయం ఏమిటంటే…పవన్ బర్త్ డే ను నెల ముందు నుంచే సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు పవన్ అభిమానులు. ఆది కూడా సరికొత్త పద్దతిలో…సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో దానికి సరిగ్గా నెల రోజుల ముందు అంటే ఆగస్ట్ 2 నుంచి పవన్ పుట్టినరోజు వేడుకలను మొదలు పెట్టారు ఆయన ఫ్యాన్స్.

30డేస్ టు గో… అంటూ పవన్ అభిమానులు నెట్ లో హంగామా చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏ హీరోకి జరగని విధంగా పవన్ ఫ్యాన్స్ సరికొత్త ట్రెండ్ తో ఇలా తమ హీరో పుట్టిన రోజు జరుపుతూ ఉండడం చూస్తుంటే…వారికి తమ హీరోపై ఎంతటి అభిమానం ఉందో అర్ధం అయిపోతుంది. ఏది ఏమైనా…పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus