‘ఆశగా’ ఎదురుచూస్తున్న ప్రిన్స్ ఫ్యాన్స్!

  • July 18, 2016 / 09:12 AM IST

సహజంగా మన టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదగాలి అంటే ముందు మాస్ మనసు దోచుకోవాలి. అప్పుడే టాప్ హీరోగా దూసుకుపోవచ్చు. అయితే టాప్ హీరోగా దూసుకుపోవాలి అని అనుకున్న క్రమంలో హీరోలు తాము చేసే సినిమాల్లో ఎక్కువ శాతం మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవాలి. అదే క్రమంలో అన్ని రకాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా సినిమాలు ప్లాన్ చేసుకోవాలి.

ఇదంతా పక్కన పెడితే…తాజాగా ప్రిన్స్ మహేష్ సినిమాల ఎంపికలో చాలా మార్పు వచ్చింది. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన ప్రిన్స్ సినిమా కోసం మాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య సినిమాల ఎంపికలో ప్రిన్స్ కొన్ని తప్పులు చేస్తున్నాడు అని, అసలు మాస్ ఎలిమెంట్స్ లేకుండా సినిమాని ఎంపిక చేసుకుంటున్నాడు అని తెలుస్తుంది. అదే క్రమంలో వచ్చిన శ్రీమంతుడు హిట్ అయినప్పటికీ, వేణు వెంటనే వచ్చిన బ్రహ్మోత్సవం డిజాష్టర్ కావడానికి ప్రిన్స్ ఎంచుకున్న కధ కారణం అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే అభిమానుల కోరిక తీర్చాలి అనుకున్నాడో, లేకపోతే తనను తాను మార్చుకోవాలి అనుకున్నాడో తెలీదు కానీ, ప్రిన్స్ మారతాను అంటున్నాడు… అందులో భాగంగానే… మురుగదాస్ తో పక్కా కమర్షియల్ సినిమా తీసేందుకు పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ ఇచ్చిన షాక్ తో కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న మహేష్ ఈ నెల చివర్లో మురుగదాస్ సినిమా స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఎలా అయినా ఈ సినిమాను సూపర్ హిట్ చెయ్యాలి అని ప్రిన్స్ చాలా కసిగా ఉన్నాడు. మరి ఈ సినిమా అయినా మన ప్రిన్స్ అభిమానుల కోరిక తీరుస్తుంది ఏమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus