ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అతని నెక్స్ట్ మూవీ ఫౌజి (Fauzi) నుండీ ఒక వీడియో రిలీజ్ చేస్తామని నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రకటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. కొద్దిసేపటి క్రితం ఆ వీడియోని రిలీజ్ చేశారు

‘ఫౌజి’ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 31 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇది 2వ ప్రపంచ యుద్ధం కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అని ఫస్ట్ షాట్ తోనే హింట్ ఇచ్చారు. మే 29, 1942లో బెర్లిన్ అనే నగరంలో బోస్ మరియు హిట్లర్ భేటీ అయినట్టు చూపించారు. 2వ ప్రపంచ యుద్ధం తారాస్థాయిలో ఉన్న సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్‌ను కలవడానికి వెళ్లినట్టు ఈ సీన్ ముఖ్య ఉద్దేశం అనుకోవాలి. వీరి సంభాషణను బట్టి.. ఇండియా , బ్రిటన్ మధ్య యుద్ధం విషయంలో సుభాష్ చంద్రబోస్ సాయం కోరుతూ హిట్లర్ వద్దకి వెళ్ళి భేటీ అయ్యారు.

అయితే హిట్లర్ ఇండియన్స్ ను తక్కువ చేసి మాట్లాడుతుంటే.. సుభాష్ చంద్రబోస్ తమ దేశంలో ఉన్న గొప్ప స్పై ఉన్నాడని అతని గురించి చెబుతాడు. భగవద్గీత ఆధారంగా ఎవ్వరూ చేధించలేని ఒక కోడ్ ను సృష్టించాడని, అది జర్మనీ వాళ్ళ ఎనిగ్మా కోడ్ కంటే కష్టమైనది అని చెబుతాడు. అలాగే ఆ స్పైని బ్రిటిష్ ప్రభుత్వం ‘ఫౌజి’ అని పిలుస్తుంది అని చెబుతాడు బోస్.

ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. పెద్ద మిషన్ గన్ తో ప్రభాస్ బ్రిటిష్ వారి పై దాడి చేస్తున్న విజువల్ పవర్ఫుల్ గా ఉంది.”ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్” అంటూ ఫౌజిలో ప్రభాస్ పాత్రను పరిచయం చేశారు. అలాగే “మోస్ట్ వాంటెడ్ – 1932” అంటూ అతని పాత్రను రిప్రెజెంట్ చేసి.. మరింత డీటెయిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus