దూసుకుపోతున్న ‘ఫిదా’ బాక్సాఫీస్ కలెక్షన్స్..!
- July 24, 2017 / 10:27 AM ISTByFilmy Focus
వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ఫిదా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి పర్ఫామెన్స్ కు ఆడియన్స ఫిదా అవుతున్నారు. వరుణ్ తేజ్ ‘ఫిదా’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ కు ఆ కోరిక తీరిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఫ్యామిలీ చిత్రాలకు పెద్ద పీట వేసిన శేఖర్ కమ్ముల మరో మంచి ప్రేమ, ఫ్యామిలీ, ఎమోషనల్, సెంటిమెంట్ అన్ని ఎలిమెంట్స్ ‘ఫిదా’ చిత్రంలో చూపించారు.
దిల్ రాజు నిర్మించిన ‘ఫిదా’ మొదటి మూడు రోజుల్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకొన్నట్లు తెలుస్తుంది. ఇండియన్, ఓవర్సీస్ లో కలిపి 25 కోట్లు పైనే వసూలు చేసినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ ఫిదా జోరు కనిపిస్తుంది. పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో లాంగ్ రన్ లో ఇంకా వసూలు వస్తాయి అనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















