మళ్లీ తెరపైకి….చిరు-బాలయ్య వార్!!!

నందమూరి బాలకృష్ణ- మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరి మధ్య అప్పట్లో బాక్స్ ఆఫీస్ వార్ ఒక రేంజ్ లో ఉండేది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఇద్దరి సినిమాలు నిలిచాయి అంటే చాలు, అభిమానులు ఒకరి పై మరోకరు పై చేయి సాధించేందుకు సిద్దం అయ్యే వారు. అయితే ఆ తరువాత చిరు సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకుని పాలిటిక్స్ కి వెళ్ళగా బాలయ్య మాత్రం అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ రెండింటినీ మ్యానేజ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే 2014ఎన్నికల సమయంలో చిరు, బాలయ్య ఒకరిపై మరొకరు పొలిటికల్ పంచ్ లు విసురుకున్నారు కానీ, పెద్దగా దుమారం ఏమీ రేగలేదు.

కానీ తాజాగా లేపాక్షి ఉత్సవాల సంధర్భంగా బాలయ్య చిరుపై చేసిన కామెంట్స్ మాత్రం భారీ దుమారానికే తెరతీసాయి. అయితే అదే విషయంపై అటు బాలయ్య అభిమానులు, ఇటు మెగాస్టార్ అభిమానులు సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో వాదోపవాదాలకు సైతం దిగారు. ఇక ఈ స్టోరీ అంతా ఒక ఎత్తు అయితే సరికొత్త స్టోరీ ఒకటి తెరపైకి వచ్చింది అదేమిటంటారా…టాలీవుడ్ నుంచి తప్పుకుని పాలిటిక్స్ లో పెద్దగా కలసిరాని చిరు చివరకు మళ్లీ తెరపైన కనిపించాలని, తన 150వ సినిమాకు సిద్దం అవుతున్నాడు. ఇక మరో పక్క బాలయ్య సైతం తన 100వ సినిమాకు సిద్దంగా ఉన్నాడు.

ఇదే క్రమంలో చిరు తమిళ సినిమా కత్తిని రీమేక్ చేయనుండగా…బాలయ్య సైతం కృష్ణవంశీ చెప్పిన ఓ కథకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఈ మూవీ కూడ రైతుల నేపథ్యంలో ఉండటంతో చిరంజీవి, బాలకృష్ణ మధ్య గట్టిపోటీ జరగనుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఇదే నిజం అయితే ఇద్దరు హీరోలు, రెండు ప్రతిష్టాత్మక సినిమాలు ఫలితం ఏమవుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus