టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది రాజమౌళి పేరును సమాధానంగా చెబుతారు. రాజమౌళితో పని చేయడానికి హీరోలు, హీరోయిన్లు ప్రముఖ నటులతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సైతం ఆసక్తి చూపుతారు. అయితే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాత్రం రాజమౌళితో వర్క్ చేస్తే అంత క్రెడిట్ రాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్ మాస్టర్లుగా మంచి పేరును సంపాదించుకున్నారు.
రామ్ లక్ష్మణ్ మాస్టర్లు దాదాపు అందరు టాలీవుడ్ హీరోలతో పని చేశారు. హీరోల బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా ఫైట్లు కంపోజ్ చేయడం ఈ ఫైట్ మాస్టర్ల ప్రత్యేకత అని చెప్పవచ్చు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్లుగా రామ్ లక్ష్మణ్ కొనసాగుతున్నారు. సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సమాజ సేవ కొరకు ఉపయోగించడం రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ప్రత్యేకత. సాధారణంగా రాజమౌళి సినిమాను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.
ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఆర్ఆర్ఆర్ మూవీకి పని చేయాల్సి ఉన్నా రామ్ చరణ్ కు గాయం కావడంతో చేయలేదని ఫైట్ మాస్టర్లు తెలిపారు. ఆ తరువాత డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నామని రామ్ లక్ష్మణ్ అన్నారు. రాజమౌళి ప్రతి షాట్ లో ఆయన ఆలోచనా విధానం ఉంటుందని అందువల్ల ఆయనతో పని చేసిన వాళ్లకు క్రెడిట్ ఎక్కువగా రాదని రామ్ లక్ష్మణ్ తెలిపారు. ఆయన చాలా కష్టపడతారని అందులో సందేహం అవసరం లేదని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ను రాజమౌళి ప్రపంచం ముందు నిలబెట్టారని జక్కన్నకు కృతజ్ఞతలు చెబుతున్నామని రామ్ లక్ష్మణ్ అన్నారు.