ప్రముఖ సినీ క్రిటిక్, నటుడు, దర్శకుడు కత్తి మహేష్ బిగ్ బాస్ షో సీజన్ 1 ద్వారా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. బిగ్ బాస్ షో తర్వాత పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కత్తి మహేష్ వార్తల్లో నిలిచారు. అయితే కత్తి మహేష్ ఎడమ కంటి చూపును కోల్పోయినట్టు ఆయన మేనమామ శ్రీరాములు మీడియాకు వెల్లడించారు. కత్తి మహేష్ కు ప్రాణాపాయం మాత్రం తప్పిందని తెలుస్తోంది.
ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో కత్తి మహేష్ చికిత్స పొందుతున్నారు. కత్తి మహేష్ ముఖానికి గట్టి దెబ్బలు తగిలాయని తెలుస్తోంది. మొదట నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన కత్తి మహేష్ ను శనివారం రాత్రి అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కత్తి మహేష్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. కత్తి మహేష్ కు ముక్కు లోపలి ఎముకలు, మరికొన్ని ఎముకలు చిట్లాయని సమాచారం. ప్రస్తుతం బోన్ రీ కన్ స్ట్రక్షన్ జరుగుతోందని మహేష్ ఇప్పటివరకు స్పృహలోకి రాలేదని సమాచారం.
ఈరోజు కత్తి మహేష్ కు కంటికి సంబంధించిన ఆపరేషన్ జరగనుందని తెలుస్తోంది. అయితే కత్తి మహేష్ మామూలు మనిషి కావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పూరిస్థాయిలో కత్తి మహేష్ కోలుకున్నా కొన్ని ఇబ్బందులతో ఆయన దీర్ఘకాలం పోరాడాల్సి ఉంటుందని తెలుస్తోంది. కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉందని తెలుస్తోంది.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!