టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన రామ్‌చరణ్ తెజ్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. అయితే ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలి అన్న కసితో ఉన్న చెర్రీ తన లుక్ ని అమాంతంగా మార్చెసాడు. అయితే అదే క్రమంలో తమిళ సినిమా ‘ధనీ ఒరువన్’ రీమేక్ గా ఈ సినిమాను చరణ్ ఎన్నో ఆలోచనలు చేసి తన మావయ్య అల్లు అరవింద్ బ్యానర్ లో చేస్తూ సెంటిమెంట్ గా తనకు ‘మగధీర’ లాంటి విజయం వస్తుందని ఆశ పడుతున్నాడు.
అయితే స్వాతంత్ర దినోత్సవం నాడు విడుదలైన ఈ సినిమా ఫర్స్ట్ లుక్ మాత్రం ఆశించినంత స్థాయిలో లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాల డిఫరెంట్ గా కనిపించడానికి ముంబాయి నుండి స్పెషల్ ట్రైనర్స్ ను రప్పించుకుని తన ఫిజిక్ లో చాల మార్పులు చేసుకున్నప్పటికీ, అభిమానులు చాలా హర్ట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి…ముఖ్యంగా ఈ సినిమా సేమ్ టు సేమ్ ‘ఎవడు’ సినిమా విషయంలో చరణ్ లుక్ ను కొద్దిగా మార్చి మీసకట్టును మాత్రం కొత్తగా పెట్టి ‘మై ఎనిమీ ఈజ్ మై స్ట్రెంగ్త్’ అనే క్యాప్షన్ తో విడుదల చేశారని, అంతేకాని ఈ ఫస్ట్ లుక్ లో క్యాప్క్షన్ తప్ప కొత్తగా ఏమీ కనిపించడం లేదు అన్న విమర్శలను ఎదుర్కుంటుంది.
కాస్ట్యూమ్ మార్చెసి ఎవడు లుక్ ని మళ్లీ రిలీజ్ చేశారా అని అంటున్నారు మరికొందరు అభిమానులు. ఇక అదే క్రమంలో చెర్రీ ఈసారి దసరా సెంటిమెంట్ ను బీట్ చెయ్యాలనే కసితో ఉన్నట్లు తెలుస్తుంది, గత రెండు సంవత్సరాలుగా దసరాకు విడుదలైన రామ్ చరణ్ సినిమాలు అన్నీ ఫెయిల్ అయిన నేపధ్యంలో ఆ సెంటిమెంట్ ను బీట్ చేసి సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాలని చూస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.