కాజల్ కు అదే ఆఖరి అవకాశం!

  • June 6, 2016 / 12:15 PM IST

దాదాపుగా కెరీర్ ఖతం అనుకొంటున్న తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓ సినిమా, సూపర్ స్టార్ మహేష్ తో మరో సినిమా అవకాశాలు తలుపు తట్టడంతో “కాజల్ బ్యాక్ టు ఫామ్” అనుకొన్నారందరూ. పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్”, మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” చిత్రాలు దాదాపుగా ఒక నెల గ్యాప్ లో విడుదలవుతుందని తెలిసినప్పుడు ఆమె అభిమానులందరూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. ఆ ఆనందం సదరు సినిమాలు విడుదలైన మొదటి రోజే ఆవిరైపోయిందనుకోండి, అదే వేరే విషయం.

అయితే.. కాజల్ నటించిన హిందీ చిత్రం “దో లఫ్జోంకి కహానీ” ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అమ్మడు కళ్ళు లేని ఆధునిక యువతిగా నటించింది. మొట్టమొదటిసారిగా ఎటువండి జిమ్మీక్కులు లేకుండా లిప్ లాక్ సైతం ఇచ్చేసింది. సాధారణంగా తన సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనడానికి ఇష్టపడని కాజల్.. ఈ సినిమా కోసం మాత్రం విపరీతంగా పబ్లిసిటీ చేస్తోంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే అమ్మడు ఇక దుకాణం సర్దేయాల్సిందే. అందుకే ఈ సినిమా హిట్టవ్వాలని అందరు దేవుళ్ళని మొక్కుతోందట. ప్రస్తుతం తెలుగులో కాజల్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. హిందీలోనూ అదే పరిస్థితి. తమిళంలో మాత్రం ఓ రెండు సినిమాలు చేస్తుంది. ఇదంతా చూస్తుంటే.. కాజల్ కెరీర్ క్లైమాక్స్ కి వచ్చేసిందేమో అనిపించక మానదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus