ఒక సెట్ నుండి మరో సెట్‌కి అంటుకున్న మంటలు.. అగ్నిప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న యూనిట్ సిబ్బంది..

  • March 11, 2023 / 09:28 AM IST

షూటింగ్ స్పాట్‌లో అనుకోకుండా సంభవించిన ప్రమాదం కారణంగా సెట్ అంతా కాలి బూడిదయ్యిందనే వార్త మీడియాతో పాటు సొషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.. షూటింగులో కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి భారీ సెట్స్ వేయడం అనేది మామూలే.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ కోసం గతంలో వేసి కాస్ట్లీ సెట్ కాలిపోయింది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రారంభంలోనే ముంబైలోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పుడు ప్రముఖ హిందీ సీరియల్‌కి సంబంధించిన భారీ సెట్టింగ్ అగ్నికి ఆహుతైంది..

వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం (మార్చి 10) ముంబైలోని ఫిలిం సిటీలో ‘ఘమ్ కిసికీ ప్యార్ మే’ షూటింగ్ స్పాట్‌లో మంటలు వ్యాపించాయి.. ఈ ఘటనలో సెట్ అంతా పూర్తిగా ధగ్దమైందని తెలుస్తోంది.. ఈ సెట్ సమీపంలోనే శూన్య స్క్వేర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మరో సీరియల్ సెట్‌కి కూడా ఈ మంటలు వ్యాపించాయి.. అయితే ఈ ప్రమాదం నుండి రెండు యూనిట్లకు చెందిన సిబ్బంది అంతా కూడా క్షేమంగా బయటపడ్డారట.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారని అంటున్నారు.

కాగా, ఓ బ్లాస్టింగ్‌కి సంబంధించిన సీన్ షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని సమాచారం.. సడెన్‌గా మంటలు వ్యాపించడంతో నటీనటులు, సిబ్బంది వెంటనే సెట్ నుండి బయటకు పరుగులు తీశారు. కానీ వారికి చెందిన వస్తువులన్నీ సెట్లోనే ఉండిపోయాయట. ముంబైలోని ఫిలిం సిటీలో సీరియల్స్ కోసం వేసిన సెట్స్ కాలిపోవడం వల్ల నిర్మాతలకు తీవ్ర నష్టమని బాలీవుడ్ కథనాలు వెల్లడిస్తున్నాయి.

కాకపోతే నిర్మాతలకు ఇన్సూరెన్స్ వస్తుందని, సీరియల్ సెట్‌కి ఇన్సూరెన్స్ రావడం కష్టమేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ‘ఘమ్ కిసికీ ప్యార్ మే’ (Ghum Hai Kisike Pyaar Mein) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. సీజన్ 1 లో ఇప్పటికి 750కి పైగా ఎపిసోడ్స్ వచ్చాయి..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus