స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సినిమా సినిమాకు నటనను మెరుగు పరుచుకుంటున్నారు. గౌరవం మూవీతో వెండి తెరకు పరిచయమైన అల్లు వారి బిడ్డ కొత్త జంటతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. శిరీష్ నటించిన తాజా చిత్రం “శ్రీరస్తు శుభమస్తు” మంచి కలక్షన్స్ తో దూసుకుపోతోంది. పరుశరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబ కథ చిత్రంలో లావణ్య త్రిపాఠి జంటగా నటించింది.
ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా బెంగళూర్ కి వెళ్లిన హీరో అక్కడి మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తాను ప్రేమ కథా చిత్రాల్లో నటించడానికి ఇష్టంగా ఉన్నట్లు తెలిపాడు. తన ఏజ్ కి కాలేజీ కుర్రోడి పాత్రలు బాగా సూట్ అవుతాయని చెప్పారు. మరో నాలుగు, ఐదు రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా సినిమాల తర్వాత భారీ బడ్జెక్ట్ చిత్రాల్లో నటిస్తానని వివరించారు. ఎందుకంటే నటనలో తనకి ఇంకా అనుభవం రావాలని అనుకుంటున్నారు.
“ఇప్పుడు మీకు రాజమౌళి యాక్షన్ సినిమా ఆఫర్ ఇస్తే ఒప్పుకుంటారా ?” అనే ప్రశ్నను ఓ జర్నలిస్ట్ అల్లు శిరీష్ ముందు ఉంచగా అందుకు ఆయన “నాలో వారికి మాస్ హీరో కనిపిస్తే, నేను వారి పాత్రకు సూట్ అవుతానని పిస్తే సంతోషంగా ఒప్పుకుంటాను. అంతే కానీ నేను స్వతహాగా యాక్షన్ సినిమాలు ఇప్పట్లో చేయను ” అని వివరించారు.