గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘చెన్నై 600028’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘చెన్నై 28 సెకండ్ ఇన్నింగ్స్’. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా..తన మాజీ అసిస్టెంట్లు ఈ చిత్ర క్లైమాక్స్ కోసం పని చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ‘ఈ చిత్ర క్లైమాక్స్ కోసం భారీ సెట్ వేశాము.
దాదాపు 300 మందిని మేనేజ్ చేయడం కష్టతరమైన పని, మరో నాలుగు రోజుల పాటు ఈ చిత్రీకరణ జరిగే అవకాశం ఉంది. 15 రోజుల పాటు ఫైనల్ మ్యాచ్ చిత్రీకరణ కోసం శ్రమిస్తున్నామ’ని ప్రభు మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ లలో ఒకరు తెలిపారు. ఈ చిత్రానికి చంద్రు, శరవన రాజన్, శ్రీపతి రంగస్వామి, విఆర్ నాగేంద్రన్, వెంకటేశన్ ఆర్ లు క్లైమాక్స్ కోసం శ్రమిస్తున్నారు.
ఈ చిత్రంలో వైభవ్, జై, శివ, నితిన్ సత్య, అరవింద్ ఆకాష్, ప్రేగ్మి అమరన్, వరలక్ష్మిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలు అందిస్తున్నారు.