Salman Khan: సల్మాన్ కి ఎప్పుడూ యంగ్ మోడల్సే కావాలి!

  • June 11, 2021 / 04:56 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి తప్పుగా మాట్లాడే సాహసం ఎవరూ చేయరు. ఆయనతో ఒక సెల్ఫీ తీసుకోవాలని నటీనటులు కూడా ఆరాటపడుతుంటారు. ఎన్నో ఏళ్లుగా బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తోన్న సల్మాన్ ని కంటెస్టెంట్ లు తెగ పొగిడేస్తుంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న సోఫియా హయత్ మాత్రం సందర్భం దొరికిన ప్రతిసారి సల్మాన్ ను టార్గెట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా సల్మాన్ నటించిన ‘రాధె’ సినిమాపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తన సినిమాల రిలీజ్ సమయంలో చాలా ఏళ్లుగా సల్మాన్ ఇదే ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని.. సరిగ్గా పండగల సమయంలో సినిమాలను రిలీజ్ చేసి లాభం పొందుతున్నాడని చెప్పింది. ఎప్పుడూ ఒకటే కథ, అదే లుక్, హీరో-హీరోయిన్ కలుసుకోవడం తప్ప కొత్తదనం ఉండడం లేదంటూ పెదవి విరిచింది. పైగా సల్మాన్ తన పక్కన హీరోయిన్ గా యంగ్ మోడల్స్ నే తీసుకుంటాడని.. తన వయసుకి తగ్గ హీరోయిన్లను తీసుకోవడానికి ఇంకా సమయం రాలేదనుకుంటున్నాడా అంటూ విమర్శించింది.

ఇవన్నీ చూస్తుంటే సల్మాన్ ఇంకా ఎదగలేదనిపిస్తుందని సెటైర్ వేసింది. కానీ ఇలాంటి బోరింగ్ సినిమాలను తిరస్కరించడంతో ప్రేక్షకులు ఎదిగారని.. ఎలాంటి సినిమాలు అంగీకరించాలి..? ఏవి రిజెక్ట్ చేయాలనే విషయంలో ప్రేక్షకుడి దృష్టి కోణం మారిందని చెప్పింది. రణదీప్ హుడా లాంటి మంచి నటుడికి ‘రాధె’లో ఇచ్చిన రోల్ అసలు బాగాలేదని.. ఆ పాత్ర అతడికి నచ్చకపోయినా.. నో చెప్పే సాహసం చేయలేడని చెప్పింది. అలా చెబితే అతడిని బాలీవుడ్ లో లేకుండా చేస్తారని ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉందంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus