వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన బాక్సాఫీస్ వద్ద మొత్తానికి బెస్ట్ ఓపెనింగ్స్ తో అతని కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. మెగా ఫ్యామిలీలోనే కాకుండా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా నెంబర్ వన్ బాక్సాఫీస్ డెబ్యూ ఫిల్మ్ గా రికార్డుల్లోకి ఎక్కింది. అయితే సినిమా చిత్ర నిర్మాతలు నమ్మినట్లుగా 90కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 60కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే అసలు టెన్షన్ శుక్రవారం నుంచే మొదలు కానుంది. మొత్తానికి మొదటి వీకెండ్ లోనే పెట్టిన బడిని వెనక్కి తేవడమే కాకుండా ప్రాఫిట్ జోన్ లోకి తీసుకొచ్చిన ఉప్పెన ఇన్ని రోజులు సోలోగానే హడావుడి చేసింది. ఇక శుక్రవారం పోటీగా మరో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. విశాల్ చక్ర, నరేష్ నాంది, సుమంత్ కపటధారి సినిమాలతో పాటూ కన్నడ డబ్బింగ్ సినిమా పొగరు విడుదలవుతున్నాయి. ఇందులో చక్ర, నాంది సినిమాలను అంత తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.
విశాల్ సినిమాలు ఏ మాత్రం క్లిక్కయినా కలెక్షన్స్ బాగానే వస్తుంటాయి. ఇక నరేష్ నాంది అంటూ చాలా కాలం తరువాత త్రిల్లర్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే పోటీ తప్పదు. మరి ఈ సినిమాలను ఎదుర్కొంటు వైష్ణవ్ తేజ్ సెకండ్ వీకెండ్ లో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.