Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

విశ్వక్ సేన్ హీరోగా కయాడు లోహర్ హీరోయిన్ గా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫంకీ'(Funky). ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేశాయి.

Funky Collections

మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కామిడీ ఉన్నప్పటికీ.. కథ, కథనాల్లో ఆర్గానిక్ ఫ్లో లేకపోవడంతో ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోయారు అని చెప్పాలి. అయినప్పటికీ మొదటి వీకెండ్ ని బాగానే క్యాష్ చేసుకుంది.కానీ మొదటి సోమవారం నుండి డౌన్ అయ్యింది. తర్వాత కోలుకుంది లేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.94 cr
సీడెడ్ 0.44 cr
ఆంధ్ర(టోటల్) 1.14 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.33 cr
ఓవర్సీస్ 1.23 cr
వరల్డ్ వైడ్(టోటల్) 5.08 cr

‘ఫంకీ’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.11.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.5.08 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.9.35 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.92 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.చూస్తుంటే అది ఇక కష్టంగానే కనిపిస్తుంది.

శ్రీలీల టైం ఆయేగా

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus