Gaalodu Review: గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుధీర్ ఆనంద్ (Hero)
  • గెహ్నా సిప్పీ (Heroine)
  • సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ , రవి రెడ్డి తదితరులు (Cast)
  • రాజశేఖర్ రెడ్డి పులిచర్ల (Director)
  • రాజశేఖర్ రెడ్డి పులిచర్ల (Producer)
  • భీమ్స్ సిసిరోలియో (Music)
  • సి రాం ప్ర‌సాద్‌ (Cinematography)
  • Release Date : 18 నవంబర్ 2022

బుల్లితెర పవర్ స్టార్ అని నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరో అన్నారు. నిజంగా బుల్లితెర పై ఆ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే… అందరూ సుధీర్ పేరే ఎక్కువగా చెప్తారు. అందుకే అతనికి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఓ పక్క చిన్నా చితకా పాత్రలు చేస్తూనే మరో పక్క హీరోగా కూడా చేస్తున్నాడు. అతను హీరోగా నటించిన మొదటి చిత్రం ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ పెద్దగా మెప్పించకపోయినా…బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది.

ఇప్పుడు ‘గాలోడు’ అంటూ మరో చిత్రంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుండా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం రండి.

క‌థ‌: రాజు (సుడిగాలి సుధీర్) పల్లెటూరిలో బలాదూర్ గా తిరిగే ఓ కుర్రాడు. అమ్మా, నాన్న అంటే విధేయత ఉండదు. కొట్లాటలు, పేకాటలు.. ఇవే ఇతనికి టైం పాస్. ఓ రోజు పేకాటలో ఆ ఊరి సర్పంచ్ కొడుకుతో ఇతనికి గొడవవుతుంది.ఆ గొడవలో ఆ సర్పంచ్ కొడుకు చనిపోతాడు. దీంతో ఆ కేసు రాజు పై పడటంతో.. అతను ఆ ఊరి నుండి పారిపోయి సిటీకి వస్తాడు. అక్కడ శుక్లా (గెహనా సిప్పి)తో రాజుకి పరిచయం ఏర్పడుతుంది.

ఆ తర్వాత తన ఇంట్లోనే డ్రైవర్ గా పెట్టుకుంటుంది. ఇతనిలో ఉన్న అన్ని నెగిటివ్ యాంగిల్స్ తెలిసినా ప్రేమలో పడుతుంది శుక్లా. అయితే ఓ రోజు రాజుని వెతుక్కుంటూ పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు? తర్వాత అతనికి జైలు శిక్ష పడుతుంది. మరి రాజు జైల్లో నుండి ఎలా బయటపడ్డాడు.అందుకు సాయం చేసింది ఎవరు? చివరికి శుక్లాని కలుసుకుంటాడా లేదా? అన్నది మిగిలిన కథ.

న‌టీనటుల పనితీరు : సుధీర్ నటన కచ్చితంగా ఆకట్టుకుంటుంది. డ్యాన్స్‌లు,ఫైట్లు, కామెడీ.. ఇలా అన్నిటిలో తన బెస్ట్ ఇచ్చాడు. ఈ సినిమా సుధీర్ ను హీరోగా ఇంకో మెట్టు పైకి ఎక్కించింది అని చెప్పొచ్చు.అయితే ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇంకొంచెం పరిణితి చెందాల్సి ఉంది. ‘చోర్ బజార్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన గెహనా సిప్పీ..

ఈ మూవీలో కూడా తన లుక్స్ తో ఆకట్టుకుంది.మొదటి సినిమా కంటే కూడా ఈ మూవీలో బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది అని చెప్పొచ్చు. మిగిలిన నటీనటుల్లో సప్తగిరి కి ఎక్కువ మార్కులు పడతాయి.తన మార్క్ కామెడీతో అక్కడక్కడా మెప్పిస్తాడు. షకలక శంకర్ కామెడీ మాత్రం భరించడం కొంచెం కష్టం.

ఇక రవిరెడ్డి,పృథ్వీ రాజ్, ఆధ్య, సత్యకృష్ణన్ వంటి నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపిస్తారు. కానీ ఆ పాత్రల నిడివి తక్కువ. వీరితో పాటు ఈ చిత్రంలో ఒకప్పటి దర్శకుడు, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ జడ్జి పాత్రలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌ కథ పై ఎక్కువ ఫోకస్ పెట్టకుండా సుధీర్ నుండి ప్రేక్షకులు.. ముఖ్యంగా అతనికి బుల్లితెర పై ఉన్న అభిమానులు ఏమైతే ఆశిస్తారో వాటి పై మాత్రమే ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది.దీంతో కథని గాలికివదిలేసిన ఫీలింగ్ కలుగుతుంది. సుధీర్ కు మంచి ఇంట్రో సీన్ ఇచ్చాడు. ఫస్టాఫ్ కూడా వేగంగా పూర్తయినట్టు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ స్లో అయిన ఫీలింగ్ కలిగిస్తుంది.

ముఖ్యంగా క్లైమాక్స్ లో సుధీర్ కత్తితో ఎక్కువ సార్లు పొడుచుకోవడం, సినిమా అయిపోతున్న టైంలో మళ్ళీ విలన్ ఎంట్రీ ఇచ్చి తాను మంచి మనిషిగా మారిపోయినట్టు హీరోకి చెప్పి.. అతనికి బిల్డప్ ఇవ్వడం ల్యాగ్ అనిపిస్తుంది. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతంలో రూపొందిన పాటలు ప్రేక్షకులు ఎలాంటి మూడ్ లో ఉన్నా వారి అటెన్షన్ ను డ్రా చేసే విధంగా ఉన్నాయి. ‘నీ కళ్ళే దివాలి’ ‘పెట్టర డీజే’ వంటి పాటలు వెంటనే ఎక్కేస్తాయి.




సినిమాలో వీటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. మిగిలిన పాటలు కూడా పర్వాలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పాటల స్థాయిలో లేదు. సి రాం ప్ర‌సాద్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ‘నీ కళ్ళే దివాలి’ పాటలోని విజువల్స్ ఆకట్టుకుంటాయి.ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. రన్ టైం 2 గంటల 5 నిమిషాలే కావడం కూడా ఓ ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

విశ్లేషణ : ఈ ‘గాలోడు’ లో కథ వీక్. పూర్తిగా సుధీర్ ఇమేజ్ పై ఆధారపడి చేసిన సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. అతని అభిమానులకు అలాగే మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతీ వీకెండ్ కు ఏదో ఒక సినిమా చూడాలి అనుకునే ప్రేక్షకులు ట్రై చేయొచ్చు తప్ప కచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే కాదు.




రేటింగ్ : 2/5 

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus