Gaami Collections: ‘గామి’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • March 9, 2024 / 05:26 PM IST

విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ (Gaami)  ‘గామి’. విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ (Karthik Sabareesh) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, మేకింగ్ వీడియో వంటివి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.78 cr
సీడెడ్ 0.31 cr
ఉత్తరాంధ్ర 0.39 cr
ఈస్ట్ 0.24 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.26 cr
కృష్ణా 0.21 cr
నెల్లూరు 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.29 cr
 ఓవర్సీస్ 0.79 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.56 cr (షేర్)

‘గామి’ చిత్రానికి రూ.9.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.3.56 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ. 5.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ కే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus