Valari Review in Telugu: వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 7, 2024 / 11:13 AM IST

Cast & Crew

  • శ్రీరామ్ (Hero)
  • రితికా సింగ్ (Heroine)
  • ఉత్తేజ్, సుబ్బరాజు, ప్రిన్సెస్ సహస్ర, పర్ణిత రుద్రరాజు (Cast)
  • మృతిక సంతోషిని (Director)
  • సత్య సాయి బాబా (Producer)
  • టి.ఎస్.విష్ణు, హరి గౌర (Music)
  • సుజాత సిద్ధార్థ్ (Cinematography)

కొంత గ్యాప్ తర్వాత ఈ వారం థియేటర్స్ లో కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో కూడా మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది. అందులో ‘వళరి’ కూడా ఒకటి. నేషనల్ అవార్డు విన్నర్ అయిన రితికా సింగ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. హర్రర్ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ‘వళరి’ టీజర్, ట్రైలర్స్ .. హర్రర్ సినిమాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళ దృష్టిని ఆకర్షించాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ: నేవీలో కెప్టెన్ గా పనిచేస్తుంటాడు నవీన్ (Sriram) (శ్రీరామ్) . దివ్య (Ritika Singh) (రితికా సింగ్) అతని భార్య. ఈ దంపతులకి ఓ కొడుకు కూడా ఉంటాడు.అయితే జాబ్ ట్రాన్స్ఫర్ లో భాగంగా నవీన్ కుటుంబం కృష్ణపట్నం షిఫ్ట్ అవుతుంది. మొదట వీళ్ళు నేవీ క్వార్టర్స్‌లో దిగుతారు… కానీ అది అంత కంఫర్ట్ గా లేకపోవడంతో తర్వాత వెంకటాపురం బంగ్లాకు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ క్రమంలో దివ్యకి ఊహించని అనుభవాలు ఎదురవుతాయి.

నిత్యం ఆమెకు ఓ కల వస్తుంది. అందులో 13 ఏళ్ళ అమ్మాయి తల్లిదండ్రులను చంపేస్తున్నట్టు ఉంటుంది. తర్వాత ఆమె ఊహించని విధంగా యాక్సిడెంట్ పాలవుతుంది. దాని వల్ల ఆమె గతం మర్చిపోతుంది. సైక్రియాట్రిస్ట్ రుద్ర (సుబ్బరాజు) దివ్యకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అసలు దివ్యకి యాక్సిడెంట్ ఎందుకు అయ్యింది.? ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయా? వీటికి సమాధానాలు తెలియాలంటే ‘వళరి’ చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : రితికా సింగ్ చాలా టాలెంటెడ్ హీరోయిన్. కానీ ‘గురు’ తర్వాత ఆమెకు సరైన పాత్ర పడలేదు. తమిళ్ లో కూడా అంతే..! అయితే ‘వళరి’లో ఆమెకు నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది అని చెప్పాలి. ఆమె మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంది కాబట్టి.. ఇందులో కర్రసాము వంటివి కూడా బాగా చేసింది. లుక్స్ పరంగా కూడా రితికా సింగ్ మెప్పించింది అని చెప్పవచ్చు. హీరో శ్రీరామ్ ఈ మధ్య వరుసగా హర్రర్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మొన్నామధ్య ‘పిండం’ తో చాలా కాలం తర్వాత ఓ హిట్ అందుకున్నాడు.

ఇప్పుడు ‘వళరి’లో కూడా తన మార్కు నటనతో మెప్పించాడు.నేవిలో పనిచేసే నవీన్ పాత్రకు అతని లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. సుబ్బరాజు గతంలో ‘పప్పు’ అనే సినిమాలో చేసిన పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో ఆయన చేసిన పాత్ర కొంచెం దానికి దగ్గరగా ఉంది. ఉత్తేజ్ కూడా తన మార్కు నటనతో ఆకట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు: హర్రర్ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఎక్కువగా అవి ఒకే ఫార్మాట్లో ఉంటున్నాయి అనే కంప్లైంట్స్ కూడా లేకపోలేదు. అలాంటి కంప్లైంట్స్ ను బ్రేక్ చేస్తూ ‘మసూద’ ‘పిండం’ లాంటి సినిమాలు వచ్చాయి.అయితే దర్శకురాలు మృతిక సంతోషిణి ‘వళరి’ అనే ఈ హర్రర్ సినిమాకి సమాజంలో ఉన్న ఓ సెన్సిటివ్ ఇష్యూని తీసుకుంది. కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి.

కానీ భయపెట్టే అంశాలు ఎక్కువగా లేవు. అక్కడ ‘వళరి’ తేడా కొట్టేసింది. క్లైమాక్స్ పోర్షన్ పర్వాలేదు అనిపించినా.. ముందు పోర్షన్ బోర్ కొట్టడంతో అది అంతగా కనెక్ట్ అవ్వదు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీకి ఫుల్ మార్కులు వేయొచ్చు. టి.ఎస్.విష్ణు, హరి గౌర నేపధ్య సంగీతం పర్వాలేదు. సత్య సాయి బాబా ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.

విశ్లేషణ: మొత్తంగా ‘వళరి’ (Valari) లో భయపెట్టే అంశాలు ఎక్కువ లేవు, అక్కడక్కడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో మెప్పించే హారర్ మూవీ ఇది కాదు. కానీ ఓటీటీ సినిమానే కాబట్టి.. ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus