వంట గదికి వెళ్లని హారిక… ఆపిల్‌ తింటూ బతికేస్తున్న అభిజిత్‌

  • September 16, 2020 / 01:53 PM IST

మూడో రోజు చప్పగా సాగిందనేమో నాలుగో రోజు గంగవ్వను పూర్తి స్థాయిలో రంగంలోకి దింపాడు బిగ్‌బాస్‌. మూడో రోజు గొడవలు, చిరాకులు మరచిపోవడానికి ఉదయాన్నే మంచి టాస్క్‌ కూడా పెట్టాడు. టమోటాలు పిసికి, పిసికి జ్యూస్‌ చేసే పని పెట్టాడు. సోహైల్‌ను సంచాలకుడిగా పెట్టినట్లున్నారు. టాస్క్‌లో ఎప్పుడూ జరిగేటట్లే… లాక్కోవడాలు, పీక్కోవడాలు జరిగినట్లున్నాయి. అమ్మ రాజశేఖర్‌, అభిజిత్‌ మధ్య అదే కనిపిస్తోంది. అయితే ఇక్కడితో ఆగుతుందా.. లేక తర్వాత గొడవకు వెళ్తుందా..

నవ్వులు పూయిస్తుందా చూడాలి. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో ఈ రోజు తెలుస్తుంది. గంగవ్వ అయితే ఈ రోజు ఫుల్‌ జోష్‌లో కనిపిస్తోంది. మొత్తం హౌస్‌ మేట్స్‌ మీద అవ్వ పంచ్‌ల ప్రవాహమే కొనసాగింది. ‘హారిక వంట రూమ్‌కే పోలేదు’ అని పంచ్‌ వేస్తే.. ఆమెకు నోట మాట లేదు. అభిజిత్‌ అయితే ఆపిల్‌ తినుకుంటూ మంచిగా ఉంటాడు అని కౌంటరేసింది గంగవ్వ. అభిజిత్‌ నుండి నవ్వే సమాధానమైంది.

దేవిని ‘దేవక్క’ అని పిలిచి సెటైర్‌ వేసింది గంగవ్వ. సూర్యకిరణ్‌కి హౌస్‌మేట్స్‌ భూసామి అని పేరిచ్చింది. ఈ లెక్కన చూస్తుంటే గంగవ్వ ఈ రోజు అందరినీ ఓ ఆట ఆడేసినట్లుంది. మరి ఈ రోజు జరిగిన ముచ్చట్లలో గంగవ్వ మిగిలిన వాళ్లను ఏమందో చూద్దాం.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus