బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

బిగ్‌బాస్‌లో మజాను రెట్టింపు చేసేది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ. షో నడుస్తున్న సమయంలో వైల్డ్‌ కార్డ్‌ అంటూ కొత్తవారిని తీసుకొస్తుంటాడు పెద్దాయన. అలా ఈసారి కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎంతమంది వస్తారు, ఎప్పుడు వస్తారు అనేదే ప్రశ్న. గత మూడు సీజన్లలో వైల్డ్‌ కార్డు రూపంలో వచ్చినవారు అయితే గొడవలు పెంచారు, లేదంటే వినోదం పెంచారు. దీంతోపాటు అమ్మాయి వస్తే అందమూ పెరుగుతుందనుకోండి. అయితే ఈ సారి ఎవరెవరు వైల్డ్‌కార్డు రూపంలో వస్తారనేదే ఇక్కడ ప్రశ్న.

వైల్డ్‌ కార్డు ఎంట్రీ గురించి మాట్లాడితే ముఖ్యంగా నాలుగు పేర్లు వినినిపిస్తున్నాయి. అయితే అందులో ముగ్గురు మాత్రమే ఇంట్లోకి వస్తారని తెలుస్తోంది. ఇంకొరు ఇంట్లో ఉన్నవాళ్లే అని అనుకుంటున్నారు. అంటే… ఇంట్లో ఉన్నవారిని బయటకు పంపించేసి, మళ్లీ సీక్రెట్‌ ఓటింగ్‌ పేరుతో మళ్లీ తీసుకొస్తుంటారు కదా.. అలాగా. గత సీజన్‌ అలీ రెజా అలానే వచ్చాడు. ఈ సారి కూడా ఇలా ఎవరో ఒకరు వస్తారు.

ఇక బయటి నుంచి వెళ్లేవారి విషయానికొస్తే… తొలుత నందు పేరు వినిపించింది. నిజానికి నందు డైరక్ట్‌ పార్టిసిపెంట్‌గానే వచ్చేవాడట. అయితే ఉత్సాహం ఆపులోక ‘బిబి’తో సందడి చేసేద్దాం అంటూ ఆ మధ్య ఓ ట్వీటు పెట్టాడు. అదే అతడి రాకకు అడ్డుపడిందనీ అంటున్నారు. అయితే ఆ ట్వీటు తన ‘బ్లాక్‌బస్టర్‌’ సినిమా గురించి అని చెప్పినా బిగ్‌బాస్‌ టీమ్‌ వినలేదని అంటున్నారు. దీంతో కొన్నాళ్లు గ్యాప్‌ ఇచ్చి వైల్డ్‌ కార్డ్‌లో చూద్దాం అన్నారని తెలుస్తోంది. అలా నందు వచ్చే అవకాశం ఉంది.

ఇక రెండో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ… ముక్కు అవినాష్‌. ఇతను కూడా డైరెక్ట్‌ ఎంట్రీ ఇవ్వాల్సినవాడే. అయితే షో స్టార్ట్‌ దగ్గరపడుతుందనగా అవినాష్‌కు కరోనా సోకిందని సమాచారం. దీంతో క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నాక లోపలకు పంపిస్తారని అంటున్నారు. క్వారంటైన్‌ టైమ్‌లోనే అవినాష్‌కు కరోనా అని నిర్ధరణ అయ్యిందట. ఇక మూడో వాడు సాయికుమార్‌ పంపన. ఇలా తెలియకపోవచ్చు కానీ ఈరోజుల్లో సాయి అంటే తెలుస్తుంది. సినిమాల్లో నత్తి క్యారెక్టర్‌తో బాగా పాపులర్‌ అయ్యి… ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వైల్డ్‌ కార్డులో త్వరలో బిగ్‌బాస్‌ ఇంట్లో కనిపిస్తాడని అంటున్నారు.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటే అమ్మాయి లేకుండా కుదరదు కదా. గత సీజన్లలో అదే జరిగింది. అందులో హాట్‌ హాట్‌ భామనే దింపుతారు. ఈ సారి ఆ హాట్‌.. తెలుగు అమ్మాయి స్వాతి దీక్షిత్‌ అంటున్నారు. ఈమె కూడా డైరక్ట్‌ ఎంట్రీ అనుకున్నదే. అయితే వైల్డ్‌ కార్డులోకి వచ్చేసింది. ఎలిమినేషన్‌లో వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్‌ అయిపోతే… ఇబ్బంది లేకుండా స్వాతి దీక్షిత్‌ను లైన్‌లో పెట్టారట. అయితే వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఉంటుందా అనేది ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అనుమానమే. ఒకవేళ వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇవ్వాలంటే వారందరినీ 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి తర్వాత ఎంట్రీ ఇస్తారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus