బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!

బిగ్‌బాస్‌లో తొలి రెండు రోజులు కాస్త ఇంట్రెస్టింగ్‌గా సాగితే మూడో రోజూ చాలా డల్‌గా సాగింది. గొడవలు, అరుపులు, ఏడుపులు సహజం అయినప్పటికీ .. అందులో ఏమాత్రం ఎంటర్‌టైన్మెంట్‌ లేదు. ఏదో ఆఖరులో గంగవ్వ కాసేపు నవ్వించింది. చప్పగా సాగిన మూడో ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగాయంటే?

* సోహైల్‌ – ఆరియానా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రావడంతో మూడో రోజు మొదలైంది. అందరినీ హాల్‌లో కూర్చోబెట్టి సోహైల్‌ – ఆరియానా చర్చ ప్రారంభించారు. జీడిపాకంలా సాగిన ఈ చర్చ చివరికి చిరాకు పుట్టించింది. ‘ఈ రోజు మీరు మాకు ఫుడ్‌ పంపలేదు’ అంటూ మొదలైన గొడవ ‘గంగవ్వ టీ తాగలేదు’ అంటూ ఊపందుకొని… అనూహ్య మలుపులు తిరిగింది. నోయల్‌ చర్చను ముందుకు తీసుకెళ్తే… సోహైల్‌ హీటెక్కించాడు. మధ్యలో అభిజిత్‌ వచ్చి క్లారిటీ ఇవ్వాలని చూస్తే… సీన్‌ రివర్స్‌ అయ్యింది. ‘కలసిపోవాలని అనుకుంటే అలాంటి యాటిట్యూడ్‌ మంచిది కాదు’ అని అభిజిత్‌ సోహైల్‌కు సూచించాడు. ‘ఫోన్‌ ఎందుకు కట్‌ చేశారు’ అంటూ సోహైల్‌ పదే పదే అనేసరికి.. అభిజిత్‌ వాయిస్‌ రెయిజ్‌ చేశాడు. ‘మీరు ఇలా అంటుంటే 14 మంది ఎందుకు చూస్తూ ఊరుకుంటారు’ అంటూ ప్రశ్నించాడు. దీంతో చర్చ ‘అరవడం’ వరకు వచ్చింది. సోహైల్‌, అభిజిత్‌ అరుచుకున్నాక… అఖిల్‌ సోహైల్‌ను కూల్‌ చేశాడు. ఆఖరులో నోయల్‌ పవన్‌ కల్యాణ్‌ ఇమిటేట్‌ చేస్తూ ఇష్యూని కూల్‌ చేసే ప్రయత్నం చేశాడు.

* రెండో రోజు ఫోన్లో ఆరియానాతో అఖిల్‌ పులిహోర కలపడం చూశాం. మూడో రోజు అయితే ఏకంగా రోటీ తినిపించాడు. ‘నా ముఖం మీద చిరునవ్వు ఉండాలి’ అందుకే తినిపించండి అని ఆరియానా అడిగితే.. అఖిల్‌ కొసరి కొసరి తినిపించాడు. అయితే నోయల్‌ వచ్చి అదేదో టాస్క్‌ అంటూ తినిపించడం నిలిపేశాడు. హౌస్‌ మేట్స్‌ అందరూ టాస్క్‌ అనుకునే చర్చ పెట్టారు. ఈలోగా ఆరియానాకు కళ్యాణి తినిపించారు.

* ఆరియానాకు అఖిల్‌ తినిపించడం మరో గొడవకు దారి తీసింది. అఖిల్‌ – నోయల్‌ మాట మాట అనుకుని.. అఖిల్‌ ఏడవడం వరకు వెళ్లింది. హౌస్‌ మేట్స్‌ అందరూ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. మరోవైపు కళ్యాణి – దేవి నాగవల్లి మధ్య కూడా మాటలు వచ్చాయి. ఎవరెంత సముదాయించినా కళ్యాణి ఏడుస్తూనే ఉంది.

* ఆరియానా వ్యవహారశైలి గురించి సోహైల్‌ ఆమెతోనే డైరెక్ట్‌గా చెప్పాడు అయితే అది ఆరియానాకు నచ్చలేదు. ‘నేనెలా ఆడాలో నువ్వు నాకు చెప్పొద్దు’ అని తెగేసింది. అలా ఇద్దరి మధ్య కూడా సయోధ్య లేకుండా పోయింది. మొత్తంగా సగం ఎపిసోడ్‌ పూర్తయ్యేసరికి హౌస్‌మేట్స్‌కు ఏమొచ్చిందో తెలియదు కానీ… చూసే ప్రేక్షకులకు మాత్రం చిరాకు తప్పకొస్తుంది.

* రోజు మారింది… బిగ్‌బాస్‌ ‘ఖైదీ నెం. 150’లోని ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ పాటేసి హుషారు తెప్పించాడు. ఎప్పటిలాగే అందరూ స్టెప్పులేస్తే… గంగవ్వ క్లాస్‌ స్టెప్పులతో అలరించింది.

* అఖిల్‌ను కట్టప్ప అని అందరూ ఎందుకు అంటున్నారో… సుజాత అఖిల్‌కే చెప్పింది. అభిజిత్‌ వచ్చి… ‘లాస్య అవ్వొచ్చేమో’ అని అన్నాడు. అంటే కట్టప్ప చర్చ ఇంకా పూర్తవ్వలేదు.

* గంగమ్మ ఉదయాన్నే జిమ్‌ ఏరియాకొచ్చింది. డంబెల్స్‌ తీసుకొని ఎక్సర్‌సైజ్‌లు చేయడం ప్రారంభించింది. డంబెల్స్‌ను పది సార్లు పైకెత్తింది. 58 ఏళ్ల వయసులో డంబెల్స్‌ ఎత్తడం మామూలు విషయం కాదు కదా. ఎక్సర్‌సైజ్‌ అయిపోయాక బిగ్‌బాస్‌కు గంగవ్వ ఓ ముద్దు కూడా పెట్టింది.

* ఒప్పో జోన్‌లో హారిక, లాస్య, గంగవ్వ కలసి సరదా ముచ్చట్లు పెట్టుకున్నారు. బయటి నుండి ఎవరైనా వచ్చిన ‘హారికను పట్టుకెళ్లిపోతే ఏం చేస్తావ్‌’ అని గంగవ్వను లాస్య అడిగింది. ‘పట్టకపోతే పట్టకపోని.. ఇంటికెళ్లిపోతుంది’ అని పంచ్‌ వేసి గంగవ్వ. మరి ‘హారికను ఇచ్చేస్తాం. నీ చీరలు ఇచ్చేస్తావా’ అంటే ఏం చేస్తావ్‌ అని అడిగితే ‘నా చీరలు నేను ఎందుకిస్తా’ ఫుల్‌ క్లారిటీ పంచ్‌ వేసింది గంగవ్వ. ‘నువ్వు వెళ్లిపోతే వెళ్లిపో నేను చీరలివ్వ’ అని అనేసింది గంగవ్వ. అంతేనా ఓ హైఫై, ఫ్లయింగ్‌ కిస్‌ కూడా ఇచ్చేసింది.

* గంగవ్వకి స్ప్రే కొడదామని ఆరియానా ప్రయత్నించింది. నీ చీరకు మ్యాచింగ్‌ లిప్‌స్టిక్‌ కూడా వేస్తా అని చెప్పింది. దానికి గంగవ్వ మామూలుగా రియాక్ట్‌ అవ్వలేదు. ‘నేను పెట్టుకోనంటున్నాగా.. ఎందుకు అరుస్తున్నావ్‌’ అంటూ ముద్దుగా కసిరేసింది గంగవ్వ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus