Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

ఇప్పుడంటే ఎంటర్టైన్మెంట్..కి సినిమాలు, స్మార్ట్ ఫోన్లు, పబ్బులు, క్లబ్బులు వంటివి చాలా ఉన్నాయి. కానీ గతంలోకి వెళితే.. జనాలకి ఎంటర్టైన్మెంట్ సోర్సులు చాలా తక్కువ. ఆ తక్కువలో నాటకాలు, బుర్రకథలు కూడా ఒకటని చెప్పాలి. ఇదిలా ఉంటే.. 1990ల దశకంలో తన పాటలు, బుర్రకథలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి ‘రెడ్డి విజయలక్ష్మి’ అలియాస్ గరివిడి లక్ష్మీ (Garividi Lakshmi).

Garividi Lakshmi First Review

ఆమె జీవితాన్ని ఆధారం చేసుకుని ‘గరివిడి లక్ష్మీ’ అనే సినిమా రూపొందింది. గౌరి నాయుడు జమ్ము ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో రాగ్ మయూర్, సీనియర్ నరేష్, శరణ్యా ప్రదీప్, రాశి, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టీజీ విశ్వ ప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2026 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కంటెంట్ పై ఉన్న నమ్మకంతో నిన్న విమల్ థియేటర్లో స్పెషల్ షో వేశారు మేకర్స్. సినిమా చూసిన వారు అనంతరం తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 21 నిమిషాలు ఉందట. పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే బుర్రకథ కళారంగంలోకి అడుగుపెట్టి, సామాజిక సమస్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్నారు గరివిడి లక్ష్మీ. అలాంటి ఆమె జీవితాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించాడట దర్శకుడు.

చదువు రాకపోయినా, ఒక్కసారి వింటే మూడు గంటల బుర్రకథను అప్పజెప్పగల అద్భుతమైన ప్రతిభ కలిగిన పల్లెటూరి అమ్మాయి గరివిడి లక్ష్మీగా ఆనంది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందట. ఆనందితో పాటు సీనియర్ నరేష్ కూడా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడట. ‘నీది కానిది అడగొద్దు, నీదైంది వదలొద్దు.. అలా వదిలేస్తే లోకానికి మనం లోకువైపోతాం’ అంటూ ట్రైలర్లో ఆయన పలికిన డైలాగ్ గట్టిగా పేలింది. సినిమాలో ఆయన పాత్రతో ఇలాంటి పదునైన డైలాగులు చాలా ఉన్నాయట. మరి రిలీజ్ రోజున ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus