Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

ప్రభాస్ చేతిలో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా.. మరో రెండు సినిమాలు బెంచ్‌ మీద ఉన్నాయి. మామూలుగా అయితే ఓ హీరోకి, అతని ఫ్యాన్స్‌ ఇది చాలా ఆనందాన్నిచ్చే అంశం. అందులోనూ స్టార్‌ హీరో ఫ్యాన్స్‌కి అయితే ఇంకానూ. కానీ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా బాధపడుతున్నారు. ఎందుకంటే ఏ సినిమా కూడా పూర్తి స్థాయిలో రెడీ అవ్వడం లేదు. ఎప్పుడు అవుతాయో తెలియడం లేదు.

Prabhas

కావాంటే మీరే చూడండి.. నిన్న మొన్నటి వరకు ‘ఫౌజీ’ సినిమా సెట్స్‌లో షూటింగ్‌ పార్ట్‌ లేకపోయినా ప్రభాస్‌ అక్కడే ఉంటూ సినిమా శరవేగంగా తెరకెక్కిస్తున్నామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ యలమంచిలి చెప్పారు. కట్‌ చేస్తే నెల తిరక్కుండానే సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయితే ఎప్పుడు వస్తారు అనేది చెప్పలేదు. సినిమా రావడం లేదు అంటే సినిమా షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉన్నట్లే కదా. అంటే ఈ సినిమాకే ప్రభాస్ డేట్స్‌ ఇవ్వాలి కదా..

కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. ప్రభాస్‌ మాకు డేట్స్‌ ఇచ్చారు అంటూ ఇతర సినిమాలకు సంబంధించిన సమాచారం వచ్చింది. ‘కల్కి 2’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ చూస్తే.. ప్రభాస్‌ – కమల్‌ హాసన్‌ – అమితాబ్‌ బచ్చన్‌ డేట్స్‌ సెట్ అయ్యాయని.. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం అని ఆ సినిమా టీమ్‌ చెబుతోంది. మరోవైపు చెప్పినట్లుగా మార్చి 5కి వస్తామని షూటింగ్‌ ప్రారంభిస్తామని ‘స్పిరిట్‌’ టీమ్‌ చెబుతోంది. ఒక్క ‘సలార్‌ 2’ సినిమా టీమే ఏమీ చెప్పడం లేదు.

దీంతో అసలు ప్రభాస్‌ ఎవరికి డేట్స్‌ ఇచ్చారు. ఎవరి సినిమా స్టార్ట్‌ అవుతుంది అనేది తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నెల 23న డార్లింగ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజున ఈ నాలుగు సినిమాల అప్‌డేట్స్‌ రావొచ్చు. ఆ రోజు చాలా క్లారిటీలు వస్తాయి.

 ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus