విజయవంతంగా 40 రోజులు పూర్తి చేసుకున్న గరుడ వేగ

అంకుశం.. అల్లరిప్రియుడు.. సింహరాశి.. వంటి సూపర్ హిట్స్ అందుకున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కి ఒక్క హిట్ అవసరమైంది. గత కొంతకాలంగా అపజయాలతో సతమవుతున్న అతను హీరోగా నిరూపించుకోవడానికి మంచి కథ కోసం రెండేళ్లు ఎదురుచూసారు. యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పిన యాక్షన్ కథ నచ్చడంతో రంగంలోకి దిగారు. “పి.ఎస్.వి గరుడ వేగ 125.18” చేశారు. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 230 థియేటర్స్ లో రిలీజై తొలి రోజు రోజు 2.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రాజశేఖర్ కి మంచి పునః స్వాగతం చెపింది.

ఈ సినిమా అతని అభిమానులకే కాదు.. నేటి యువతకు బాగా నచ్చింది. మహేష్ బాబు వంటి స్టార్స్ సైతం ప్రవీణ్ సత్తార్ ని అభినందించారు. కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలను తట్టుకొని, రోజు రోజుకి కలక్షన్స్ పెంచుకుంటూ పి.ఎస్.వి గరుడ వేగ 125.18 విజయవంతంగా 40 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈరోజు 40 రోజుల పోస్టర్ ని విడుదల చేసింది. జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై కోటేశ్వర రాజు, మురళి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే 50 రోజులకు చేరుకోనుంది. ఈ విజయోత్సాహంతో రాజశేఖర్ మరో యాక్షన్ సినిమాని చేయడానికి కథలను వింటున్నారు. అలాగే తమ కూతుళ్లను గ్రాండ్ గా వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus