చరిత్ర ప్రారంభం అయ్యింది…”గౌతమి పుత్ర శాతకర్ణి”

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100 వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు… క్రిష్ జాగర్లమూడి. ఉగాది పర్వదినాన అయిదు కోట్ల ఆంధ్రుల ఆశల పల్లకు అమరావతిలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక ఆతరువాత ఈ చిత్రం యొక్క ముహూర్తపు షాట్ ను హైదరాబాద్ లో అతిరధమహారధులు, సినీ ప్రముఖులు మధ్య జరుపుకున్న విషయం సైతం అందరికీ తెలిసిందే…ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే….భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించిన ఒక గొప్ప వీరుడి కథ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ మొరాకో లో ప్రారంభమైనది. ఈ షెడ్యూల్ లో  సినిమాకు ముఖ్యం అయితే యుద్ద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు ఫైట్ మాస్టర్స్ గా రామ్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ షెడ్యూల్  దాదాపుగా మూడు వారాల పాటు జరగనున్నట్లు తెలుస్తుంది. అతి తక్కువ ఖర్చుతో కంచే సినిమాలో ప్రపంచ యుద్ద సన్నివేశాలను ఎంతో అందం గా తెరకెక్కించిన క్రిష్ ఈ యుద్ద సన్నివేశాల కోసం దాదాపు 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని తెలిసింది.ఇంత భారీ గా ఖర్చు పెడుతూ తీస్తున్న ఈ యుద్ద సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలెట్ గా నిలవనున్నాయని చిత్ర యూనిట్ ధీమా గా వుంది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అదే క్రమంలో తొలి టీజర్ ను జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భం గా విడుదల చేయనుండటం తో నందమూరి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus