ఇక చిల్కూర్ లో ‘శాతకర్ణి’..!

  • May 25, 2016 / 12:52 PM IST

బాలకృష్ణ నటిస్తున్న 100 వ చిత్రం గౌతమ పుత్ర శాతకర్ణి. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ మొరాకోలో జరుగుతుండగా.. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం అక్కడ షూటింగ్ ముగించుకువచ్చిందని అంటున్నారు. మొరాకోలో పలు యుద్ద సన్నివేశాలను చిత్రీకరించగా.. ఈ సన్నివేశాలపై చిత్ర బృందం సంతృప్తికరంగా ఉందట.

మరోవైపు హైదరాబాద్ లోని చిల్కూర్ వద్ద వేసిన భారీ సెట్ లో ఈ చిత్రం ఇప్పుడు చిత్రీకరణ జరుపుకోనుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus