రూమర్స్ కు చెక్ పెట్టిన గౌతమ్ మీనన్..!

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎనై నొక్కి పాయుమ్ తోటా’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. ఈ చిత్రంలో రానా ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినరాగా.. ఈ వార్తలను ఆయన కొట్టిపారేశారు. పలు చిత్రాల్లో గౌతమ్ మీనన్ అతిధి పాత్రల్లో నటించగా..

ఈ చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడా? లేదా ఏదైనా పాత్ర పోషిస్తున్నాడా? అన్న ప్రశ్నలకు మాత్రం చిత్ర బృందం నుంచి సమాధానం లభించలేదని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఒండ్రాగా ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన మేఘా ఆకాశ్ జంటగా నటిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus